
వరుస సినిమాలతో బిజీ గా ఉన్న మెగా స్టార్ చిరంజీవి రీసెంట్ గా శుభగృహ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాడు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ యాడ్ లో చిరంజీవి భార్య గా కుష్భు నటించగా, అనసూయ మరో పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ యాడ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ యాడ్ కోసం చిరంజీవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడో అని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ యాడ్ కోసం సుమారు 7 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటి వరకు తెలుగులో యాడ్ ఫిల్మ్స్ లో నటించిన ఏ హీరో కూడా ఈ స్థాయిలో పారితోషికం తీసుకోలేదని ఈ స్థాయిలో ఓ రియల్ ఎస్టేట్ యాడ్ కు రెమ్యునపరేషన్ అందుకోవడం ఇదే తొలిసారి అని అంటున్నారు. చిరంజీవి ఒక్కరికే కాదు ఆయన పక్కన నటించిన అనసూయ , కుష్భు లకు కూడా భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చారని అంటున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ డైరెక్షన్లో చేసిన ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.