
పవన్ కళ్యాణ్ – భూమిక ల కలయికలో వచ్చిన ఖుషి మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు..ముఖ్యముగా ఈ మూవీ లో నడుము సీన్ ఓ రేంజ్ లో హైలైట్ అయ్యింది. ఇప్పటికి ఈ సీన్ ను యూట్యూబ్ లో చాలామంది చూస్తుంటారు. అలాంటి ఈ సీన్ ఇప్పుడు చిరంజీవి – శ్రీముఖి ల మధ్య ఉండబోతుందట. చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో భోళా శంకర్ మూవీ తెరకెక్కుతుంది. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా , హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. అలాగే ఓ కీలక పాత్రలో యాంకర్ శ్రీముఖి నటిస్తుంది. అయితే చిరంజీవి – శ్రీముఖి ల మధ్య ఖుషి నడుము సీన్ ను షూట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి రొమాంటిక్ చూపులు, మ్యానరిజం, డైలాగ్స్ ఈ సీన్‌లో అదిరిపోయేలా వచ్చాయని అలాగే ఆ సీన్ లో శ్రీముఖి కూడా హావభావాలు అదరగొట్టిందని అంటున్నారు. మరి ఇది నిజామా..కదా..ఒకవేళ నిజమైతే ఆ సీన్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.