Homeటాప్ స్టోరీస్కొర‌టాల సై అంటే మెగాస్టార్ నో అన్నారా?

కొర‌టాల సై అంటే మెగాస్టార్ నో అన్నారా?

కొర‌టాల సై అంటే మెగాస్టార్ నో అన్నారా?
కొర‌టాల సై అంటే మెగాస్టార్ నో అన్నారా?

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల సై అంటే మెగాస్టార్ చిరంజీవి ఎందుకు నో చెప్పారు? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివారాల్లోకి వెళితే.. `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి చారిత్ర‌క సినిమా త‌రువాత వేగం పెంచారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా త‌రువాత కొంత విరామం తీసుకుంటార‌ని అంతా భావించారు. కానీ ఆ ఊహ‌ల‌కు పూర్తి భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్టారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌మ‌తి సురేఖ స‌మ‌ర్ప‌‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా క‌నిపించ‌బోతున్నారు. మ‌రో కీల‌క  పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌నున్నారు. ఆయ‌న‌ది ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వ‌స్తుంద‌ని, రాడిక‌ల్ స్టూడెంట్ లీడ‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. `ఆచార్య‌` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని  చిరు పుట్టిన రోజైన ఈ నెల 22న రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇదే రోజున చిరు డైలాగ్‌తో టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల ప్లాన్ చేశార‌ట‌.

- Advertisement -

ర‌ఫ్‌ క‌ట్‌ని చిరుకి పంపించి ఫైన‌ల్ చేయమన్నార‌ట‌. అయితే దీనికి చిరు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఇప్పుడే టీజ‌ర్‌ వ‌దిలితే ఆ త‌రువాత స‌ర్‌స్రైజ్‌లు ఇవ్వ‌డానికి ఏమీ వుండ‌ద‌ని, ఇప్పుడే టీజ‌ర్ ఆలోచ‌న వ‌ద్ద‌ని కొర‌టాల ప్ర‌య‌త్నాల‌కు నో చెప్పిన‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All