Homeటాప్ స్టోరీస్ఆచార్య లో చిరు లుక్ చూస్తుంటే..చూడాలని ఉంది సినిమా గుర్తుకొస్తుంది

ఆచార్య లో చిరు లుక్ చూస్తుంటే..చూడాలని ఉంది సినిమా గుర్తుకొస్తుంది

chiranjeevi Naya look
chiranjeevi Naya look

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో చిత్రం తాలూకా విశేషాలు , స్టిల్స్ , వీడియోస్ , మేకింగ్ ఇలా ప్రతిదీ బయటకొస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి స్టిల్స్ చూస్తుంటే..1998 లో చూడాలని ఉంది సినిమా గుర్తుకు వస్తుంది. ఆ టైం లో చిరంజీవి ఎలాగైతే ఉన్నాడో..ఇప్పుడు ఆచార్య లో కూడా అలాగే ఉన్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి – రామ్ చరణ్ తండ్రి కొడుకుల్లాగా కాదు అన్న దమ్ముల్లాగా ఉన్నారని అనిపిస్తుందని అంటున్నారు. చిరు లుక్ , డాన్స్ , డైలాగ్ డెలివరీ ఇలా అన్ని కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ మూవీ తో చిరు ను కొత్తగా చూడబోతున్నామని అంటున్నారు. ఇక చిరు నుండి వరుసగా సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. ‘భోళాశంకర్’ తో పాటు బాబీ దర్శకత్వంలో MEGA 154 సినిమా చేస్తున్నారు. ఈ పిక్చర్ కు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో మెగాస్టార్ తన 155వ సినిమా చేయనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All