
దాసరి మరణం తర్వాత టాలీవుడ్ కు పెద్ద దిక్కు అయ్యాడు చిరంజీవి. ఈ మాట ఆయన ఒప్పుకోకపోయినా ఇండస్ట్రీ మాత్రం చిరంజీవే దిక్కు అంటున్నారు. మొన్న ఏపీ టికెట్ ధరల విషయంలో చిరంజీవి ఎంత చేసాడో తెలియంది కాదు..అలాగే కేవలం పెద్ద సినిమాల ప్రొమోషన్లకే కాకుండా చిన్న సినిమాల ప్రమోషన్ వేడుకలకు సైతం చిరు హాజరవుతూ తన పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఈ తరుణంలో తాప్సి ప్రధాన పాత్రలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్(మిషాన్) ఇంపాజిబుల్’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరు కాబోతున్నారు.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్‌జె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1వ తేదీన విడుదల కాబోతుంది. ఈ తరుణంలో బుధవారం హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం వెల్లడించింది. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత తాప్సీ ఈ మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొంటుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.