Homeటాప్ స్టోరీస్సిద్ద క్యారెక్టర్ చరణ్ కాకపోతే పవన్ చేసేవాడట

సిద్ద క్యారెక్టర్ చరణ్ కాకపోతే పవన్ చేసేవాడట

acharya run time
acharya run time

కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి , రామ్ చరణ్ లు హీరోలుగా ఆచార్య మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలను చేస్తూ సినిమా తాలూకా అనేక విశేషాలను తెలియజేస్తున్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఆచార్య టీం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకి చిరంజీవి, ఆచార్య టీం సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ విలేఖరి సిద్ధా క్యారెక్టర్ చరణ్ కాకపోతే పవన్ చేస్తారా అని అడిగారు.

- Advertisement -

చిరంజీవి దీనికి సమాధానమిస్తూ.. ”దీని గురించి ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాను. ఈ క్యారెక్టర్ కి ఆచార్యకి ఒక మంచి అనుబంధం ఉంటుంది. అది రియల్ తండ్రి కొడుకులు అయిన మేము చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. డైరెక్టర్ కూడా అదే నమ్మారు. ఈ క్యారెక్టర్ చరణ్ కాకుండా ఇంకెవరు చేసినా బాగానే చేస్తారు. కాకపోతే మా ఇద్దరి మధ్య ఉన్న తండ్రి కొడుకుల బంధం ఆ క్యారెక్టర్స్ ని మరింత దగ్గరికి చేస్తుంది. చరణ్ కి ఒకవేళ కుదరకపోతే కచ్చితంగా పవన్ ఈ క్యారెక్టర్ చేసేవాడు. పవన్ కూడా సిద్దా క్యారెక్టర్ ని అద్భుతంగా చేస్తాడు. పవన్ చేస్తే కచ్చితంగా బాగుంటుంది. కానీ చరణ్ తో చేయాలని రాసి ఉంది, చరణ్ కి కుదిరింది చేశాము” అని అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All