Homeటాప్ స్టోరీస్కృష్ణవంశీ సినిమాలో చిన్నారి పెళ్లికూతురు !!!

కృష్ణవంశీ సినిమాలో చిన్నారి పెళ్లికూతురు !!!

కృష్ణవంశీ సినిమాలో చిన్నారి పెళ్లికూతురు !!!
కృష్ణవంశీ సినిమాలో చిన్నారి పెళ్లికూతురు !!!

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ సినిమా అంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. అన్ని రకాల సినిమాలు తీసి ఆయన సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో సినిమాలు చేసిన కృష్ణవంశీ ఇప్పుడు కొంచం స్లో అయ్యారు. లేటెస్ట్ గా ఈ దర్శకుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు, ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

రెడ్ బల్బ్ మూవీస్, ఎస్‌విఆర్ గ్రూప్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్స్‌పై.. అభిషేక్‌ జవ్‌కర్, మధు కలిపు నిర్మించనున్న ఈ చిత్రం ‘నటసామ్రాట్‌’ అనే మరాఠీ సినిమాకు రీమేక్. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ భార్య భర్తలుగా కనిపించబోతున్నారు. వీరికి కుమార్తెగా చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ నటిస్తోంది. ఇటీవలే ఈ అమ్మాయి రాజు గారి గది 3 చిత్రంలో నటించింది. మరాఠీలో పెద్ద సక్సెస్ అయిన ఈ సినిమాతో కృష్ణ వంశీ కం బ్యాక్ అవుతాడేమో చూద్దాం.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All