Homeటాప్ స్టోరీస్చినబాబు ఓవర్ సీస్ టాక్

చినబాబు ఓవర్ సీస్ టాక్

chinnababu overseas talkతమిళ స్టార్ హీరో కార్తీ నటించిన చినబాబు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యింది అయితే ఓవర్ సీస్ లో మాత్రం ముందుగానే ప్రీమియర్ షోలు పడ్డాయి , కాగా ఆ ప్రీమియర్ షోల ప్రకారం టాక్ ఎలా ఉందో తెలుసా …… …. పెద్ద హిట్ కాదు కానీ కార్తీ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు ఓవర్ సీస్ ప్రేక్షకులు . కార్తీ రైతు గా కనిపించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నాడట అక్కడ ! ఓవర్ సీస్ జనాలకు ఈ రైతు సినిమా నచ్చితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మరింతగా నచ్చడం ఖాయం .

విభిన్న కథా చిత్రం కాదు కానీ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్న ఈ చిత్రంతో కార్తీ విజయం సాధించినట్లే అని అంటున్నారు . పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ అన్నయ్య హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం . తెలుగు , తమిళ బాషలలో విడుదలైన ఈ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు కార్తీ . ఈ హీరో తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు . గతకొంత కాలంగా సక్సెస్ కొట్టలేక పోతున్న కార్తీ ఖాకీ చిత్రంతో హిట్ అందుకున్నాడు ఇక ఇపుడేమో దానికి కొనసాగింపుగా చినబాబు ఉంది .

- Advertisement -

కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ , సాయేషా సైగల్ , సత్యరాజ్ , సూరి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు .

English title: chinna babu overseas talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All