Homeటాప్ స్టోరీస్‘చెన్నై చిన్నోడు’ ఆడియో లాంచ్‌

‘చెన్నై చిన్నోడు’ ఆడియో లాంచ్‌

జి.వి ప్రకాష్‌ కుమార్ హీరోగా న‌టిస్తూ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఓ త‌మిళ చిత్రాన్ని `చెన్నై చిన్నోడు` (వీడి ల‌వ్‌లో అన్నీ చిక్కులే ట్యాగ్‌లైన్‌) పేరుతో శూలిని దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెలుగులోకి అనువ‌దిస్తున్నారు వి.జ‌యంత్ కుమార్‌. నిక్కీ గల్రానీ , ర‌క్షిత హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి ఎం.రాజేష్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను గురువారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎఫ్ సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ సీడీల‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ….“ త‌మిళంలో స‌క్సెస్ అయిన చిత్రాన్ని తెలుగులో `చెన్నై చిన్నోడు`గా అనువ‌దిస్తున్నారు. చిన్న‌త‌నంలోనే నిర్మాత‌గా మారిన జ‌యంత్ కుమార్ ను అభినందిస్తూ ,ఈ సినిమా స‌క్సెస్ సాధించి త‌న‌కు నిర్మాత‌గా మంచి భ‌విష్య‌త్ ఏర్ప‌డాల‌ని కోరుకుంటున్నా. జీవి ప్ర‌కాష్ హీరోగా న‌టిస్తూ..మ్యూజిక్ చేశారు. పాట‌లు, ట్రైల‌ర్ అద్భుతంగా ఉన్నాయి. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.

సాయివెంక‌ట్ మాట్లాడుతూ…“ జీవీ ప్ర‌కాష్ కుమార్ న‌టించిన ఈ చిత్రం త‌మిళంలో మ్యూజిక‌ల్ హిట్ అయింది. పాట‌లు, ట్రైల‌ర్ క‌ల‌ర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమా యువ నిర్మాత జయంత్ కు మంచి ఆరంభం కావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

- Advertisement -

నిర్మాత వి.జయంత్‌ కుమార్‌ మాట్లాడుతూ…‘‘మా తాత గారి ద‌గ్గ‌ర నుంచి మాకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. అలా నాకు కూడా సినిమాల పై ఆస‌క్తి ఏర్ప‌డింది. తొలిసారిగా త‌మిళ చిత్రాన్ని చెన్నై చిన్నోడు పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నాం. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా తెలుగు స్ర్టెయిట్ సినిమాలా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చేయించాము. పూర్ణ‌చారి గారు పాట‌ల‌న్నింటికీ అర్ధ‌వంత‌మైన సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్‌ టైనర్‌. ప్రకాష్‌ రాజు గారి పోలీస్‌ పాత్ర సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుంది. అలాగే హీరో జీవా గారు గెస్ట్ రోల్ లో క‌నిపిస్తారు. జి.వి ప్రకాష్ గారి నటన తో పాటు, సినిమాకు మంచి సంగీతాన్ని కూడా అందించారు. అందమైన ఫారెన్‌ లోకేషన్లలో పాట‌లు చిత్రీకరించారు. అతి త్వ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

`గంగ‌పుత్రులు` ఫేం రాంకీ మాట్లాడుతూ…“పాట‌లు విన‌డానికి, చూడ‌టానికి చాలా బావున్నాయి. ట్రైల‌ర్ చాలా క‌ల‌ర్ ఫుల్ గా, ట్రెండీగా
ఉంది. సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌నీ, నిర్మాత‌కు మంచి పేరు తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

పాట‌ల ర‌చ‌యిత పూర్ణ‌చారి మాట్లాడుతూ…“తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఇందులో నాలుగు పాట‌లు రాశాను. సింగ‌ర్స్ కూడా చాలా బాగా పాడారు. జీవీ గారి సంగీతంతో పాటు న‌ట‌న కూడా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంది. ఎంతో ప్యాష‌న్ తో తెలుగులోకి అనువ‌దిస్తున్న నిర్మాత జ‌యంత్ గారికి ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందించాల‌న్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు, సింగ‌ర్స్ సంప‌త్, సాయి మాధ‌వ్, మౌనికా రెడ్డి, మ్యూజిక్ కో-ఆర్డినేట‌ర్ మాల్య కందుకూరి త‌దిత‌రులు పాల్గొన్నారు.
హీరో జీవా (గెస్ట్ రోల్‌) , ప్ర‌కాష్ రాజ్‌, బాలాజీ, ఊర్వ‌శి, జీవ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లుః వెలిదెండ్ల రాంమూర్తి, పాట‌లుః సి.హెచ్‌ పూర్ణాచారి, సంగీతం: జి.వి. ప్రకాష్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్‌.కృష్ణ, నిర్మాత వి.జయంత్‌ కుమార్‌ (బి.టెక్‌). ద‌ర్శ‌కత్వంః ఎం.రాజేష్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All