Homeటాప్ స్టోరీస్అమీషా పటేల్ పై చీటింగ్ కేసు

అమీషా పటేల్ పై చీటింగ్ కేసు

Cheating case file aganist Ameesha patelబాలీవుడ్ భామ అమీషా పటేల్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది . ఇప్పటికే ఓ కార్యక్రమానికి వస్తానని చెప్పి డబ్బులు తీసుకొని హ్యాండ్ ఇచ్చిన కేసులో అభాసుపాలైన అమీషా పటేల్ తాజాగా ఓ ఫైనాన్సియర్ దగ్గర రెండున్నర కోట్ల రూపాయలను తీసుకొని ఇవ్వకుండా అతడ్ని వేధిస్తున్న కేసులో మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఈ భామ . సంఘటన వివరాలలోకి వెళితే ……” దేశీ మ్యూజిక్ ” అనే చిత్రాన్ని కునాల్ తో కలిసి నిర్మించింది అమీషా పటేల్ .

 

- Advertisement -

అయితే ఆ సినిమా పూర్తి అయ్యింది కానీ రిలీజ్ కావడం లేదు , దాంతో ఆ సినిమాకు ఫైనాన్స్ చేసిన అజయ్ కుమార్ తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తేవడంతో చెక్ లు ఇచ్చారట అమీషా పటేల్ , కునాల్ లు . అయితే ఆ చెక్ లు బౌన్స్ కావడంతో మళ్ళీ అడిగాడట ! ఈసారి ఎవరెవరివో ఫోటోలు చూపించి బెదిరించారట దాంతో పోలీసులను ఆశ్రయించాడు . దాంతో చీటింగ్ కేసు తో పాటుగా చెక్ బౌన్స్ కేసు కూడా నమోదయ్యింది ఈ భామపై . తెలుగులో బాలకృష్ణ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ ల సరసన నటించింది అమీషా పటేల్ .

English Title : Cheating case file aganist Ameesha patel

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All