Homeటాప్ స్టోరీస్జేపి కూడా హీరో అయిపోతున్నాడు

జేపి కూడా హీరో అయిపోతున్నాడు

జేపి కూడా హీరో అయిపోతున్నాడు
జేపి కూడా హీరో అయిపోతున్నాడు

తెలుగుపరిశ్రమ అంటే ఎంతోమందికి మంచి జీవితాన్ని ఇచ్చింది. కొంతమందికి మొదటి సారి జీవితాన్ని ఇవ్వకపోయినా జీవితాన్ని మాత్రం ప్రసాదించేది తెలుగుపరిశ్రమ. అలా ఇచ్చిన జీవితాన్ని సఫలం చేసుకున్న వారు ఉన్నారు. ఎన్ని సార్లు అవకాశం ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అడ్డ దిడ్డ మైనా మెలికలు తిప్పుకుంటూ కొంతమంది తెలుగు పరిశ్రమకి దూరం అయిన వారు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు కొత్తగా పరిచయం అయిన వారు పాత వారిని చూసుకుంటూ మెల్లగా అడుగులు వేసుకుంటున్నారు.

అయితే చాలామంది పాత తరం నటినటులకి కొత్తగా ఏమన్న చేసి జనాలని నవ్వించాలి, కన్నీరు తెప్పించాలి, బావోద్వేగాయాలకు గురి చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగాయి. అందులో బ్రహ్మానందం, బాబు మోహన్, ఏ. వి. ఏస్, గుండు హనుమంత రావు, తనికెళ్ళ భరణి గారు లాంటి హాస్య నటులు కూడా హీరోలుగా అడపాదడపా సినిమాలలో కనిపించేవారు. ఇప్పుడు ఇంకొకరి వంతు వచ్చింది. అతను కూడా ఇంతవరకు కథానాయకుడిగా చేయలేదు అని చెప్పి ఒక రాయి వేసుకొని తన అదృష్టాన్ని నిరూపించుకోవాలి అని ముందుకు వస్తున్నారు.

- Advertisement -

విలన్ గా బయపెట్టాడు, హాస్య కథానాయకుడిగా కిత కితలు పెట్టారు, తన వేష బాష మన అందరికీ బాగా ఇష్టం. ఆయనే నటులు ‘జయ ప్రకాష్ రెడ్డి’. ఇంకా గుర్తు రాకపోతే ఒకసారి ‘కిత కితలు’, ‘ఎవడి గోల వాడిది’ సినిమాలు చూసేయండి మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఆయన వంతు హీరో గా నటించాలి అని ఒక సినిమాకి శ్రీకారం చుట్టారు. షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ధవల సత్యం దర్శకత్వం చేసారు, సినిమా పేరు ‘అలెగ్జాండ‌ర్‌’. సినిమాకి నిర్మాత కూడా జేపి గారే. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఈయన ఏంటి ఈ వయసులో హీరోగా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్తా కూడా చదివేయండి.

ఈ సినిమా ఒక నాటక రంగం పరంగా సాగుతుంది అంట. సినిమాలో మనకి ఎక్కువగా జేపీ గారే కనిపిస్తారు. ఏకపాత్రాభిన‌యం వేషధారణలో పలు రసాల మీద నాటకాలు నడిపించే పాత్రలో మనకి వివిద గెట్ అప్ లో  జేపి గారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ సినిమా మీద ఆయన చాలా నమ్మకంతో ఒక అడుగు ముందుకి వేస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్ లో జనాలకి నచ్చుతుందా? లేదా? అనేది సినిమా విడుదల దాకా కొంచెం సందేహం గాని ఉంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All