
శనివారం ఉదయం సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు 350 కు పైగా చిత్రాల్లో నటించే మెప్పించిన ఈయన..ఈరోజు ఉదయం యూసఫ్ గూడ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల యావత్ చిత్రసీమ దిగ్బ్రాంతి వ్యక్తం చేయగా…తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాలయ్య 300 పైగా చిత్రాల్లో నటించారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యుత్తమ నటుల్లో బాలయ్య ఒకరని కొనియాడారు. బాలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
మన్నవ బాలయ్య 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించారు. ఆయన తండ్రి మన్నవ గురవయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. బాలయ్య కన్నవారు ఇద్దరూ సాహిత్యాభిలాషులు. చదువంటే ప్రాణం. అందువల్ల తమ అబ్బాయిని బాగా చదివించాలని తపించారు. అదే రీతిన బాలయ్య కూడా ఆ రోజుల్లోనే బి.ఇ., చదివారు. 1952లో బి.ఇ., పట్టా పుచ్చుకోగానే కాకినాడ, మద్రాసు పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ గా పనిచేశారు. అప్పట్లోనే ఆయన నాటకాలు వేసేవారు. బాలయ్యను చూసిన కొందరు హిందీ నటుడు అశోక్ కుమార్ లాగా ఉన్నావు అనేవారు. దాంతో ఆయనకు కూడా సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. మిత్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు.
ప్రముఖ నటులు, సినీ దర్శక నిర్మాత మన్నవ బాలయ్య గారి మరణం విచారకరం. 300కు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. బాలయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/1dXSqtSDTI
— N Chandrababu Naidu (@ncbn) April 9, 2022