Homeన్యూస్ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేతుల మీదుగా...

ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేతుల మీదుగా ‘సికాడా’ ఫస్ట్ లుక్ పోస్టర్

ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేతుల మీదుగా ‘సికాడా’ ఫస్ట్ లుక్ పోస్టర్
ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేతుల మీదుగా ‘సికాడా’ ఫస్ట్ లుక్ పోస్టర్

తెలుగులో ప్రస్తుతం పాన్ ఇండియన్ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే అందరినీ ఓ కొత్త కాన్సెప్ట్‌తో పలకరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్‌తో రాబోతోన్న ఈ మూవీ విడుదలకు ముందు సంచలనాలు సృష్టించేలా కనిపిస్తోంది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో సోహెల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, నటీనటుల లుక్స్, గెటప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

సికాడా యూనిట్‌లో అంతా కూడా కొత్త వారే. శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిత్ సిఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా షూటింగ్ బెంగుళూరు, అట్టపాడి, వాగమోన్, కొచ్చి తదితర ప్రాంతాల్లో జరిగింది. తెలుగు భాషలోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు.

శ్రీజిత్ ఎడవనా మ్యూజిక్ డైరెక్టర్‌గా “కాదల్ ఎన్ కవియే”, “నెంజోడు చేరు” వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు సికాడాతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.

ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి నవీన్ రాజ్ కొరియోగ్రాఫర్, శైజిత్ కుమారన్ ఎడిటర్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.

నటీనటులు : రజిత్ సిఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్

సాంకేతిక బృందం
బ్యానర్ : తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : వందనా మీనన్, గోపకుమార్ పి
దర్శకుడు : శ్రీజిత్ ఎడవనా
సంగీత దర్శకుడు : శ్రీజిత్ ఎడవనా
సాహిత్యం : రవితేజ అమరనారాయణ
కొరియోగ్రాఫర్ : నవీన్ రాజ్
ఎడిటర్ : శైజిత్ కుమారన్
పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All