Homeటాప్ స్టోరీస్ఛలో దర్శకుడి తో నితిన్

ఛలో దర్శకుడి తో నితిన్

chalo director next film with nithinయంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన ఛలో చక్కటి విజయం సాధించిన విషయం తెలిసిందే . ఛలో చిత్రంతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు . తొలిచిత్రంతోనే సూపర్ హిట్ ని అందుకున్న వెంకీ కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి . అయితే ముందుగానే వెంకీ ని పట్టేసింది సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ . త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ ని తమ సంస్థలో సినిమా చేయమని కోరడంతో వెంకీ సంతోషంగా ఒప్పుకున్నాడు .

ఇక ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించవచ్చు అని తెలుస్తోంది . ప్రస్తుతం నితిన్ చల్ మోహనరంగ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు అలాగే శ్రీనివాస కళ్యాణం లో ప్రస్తుతం నటిస్తున్నాడు అది కాగానే వెంకీ దర్శకత్వంలో నటించడానికి రెడీ కానున్నాడు నితిన్ . మొదటి ప్రయత్నాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వెంకీ ద్వితీయ విఘ్నం ని దాటుతాడా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All