Homeటాప్ స్టోరీస్`చావు క‌బురు చ‌ల్ల‌గా` మూవీ రివ్యూ

`చావు క‌బురు చ‌ల్ల‌గా` మూవీ రివ్యూ

`చావు క‌బురు చ‌ల్ల‌గా` మూవీ రివ్యూ
`చావు క‌బురు చ‌ల్ల‌గా` మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  కార్తికేయ గుమ్మ‌కొండ‌, లావ‌ణ్య త్రిపాఠి, అమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌జిత‌, మ‌హేష్‌, భ‌ద్రం, ప్ర‌భు త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం: క‌ఔశిక్ పెగ‌ళ్ల‌పాటి
నిర్మాత‌:  బ‌న్నీవాసు
సంగీతం:  జేక్స్ బిజోయ్‌
సినిమాటోగ్ర‌ఫీ: క‌ర్మ్ చావ్లా
ఎడిటింగ్‌: జి. స‌త్య‌
రిలీజ్ డేట్: 19-03-21
రేటింగ్‌: 3/5

`Rx 100`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ‌. ఈ మూవీ త‌రువాత ఆ స్థాయి హిట్ కోసం ప్ర‌య‌త్నిస్తూనే వున్నారు. ఇందులో భాగంగా కార్తికేయ న‌టించిన చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`.  ఇటీవ‌ల `ప్ర‌తి రోజు పండ‌గే` చిత్రంతో సాయి ధ‌ర‌మ్‌తేజ్‌కి సాలీడ్ హిట్‌ని అందించిన టాలెంటెడ్ ప్రొడ్యూస‌ర్ జీఏ2 ప్రొడ‌క్ష‌న్స్ అధినేత యువ నిర్మాత బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. దీంతో ఈ మూవీపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కౌశిక్ పెగ‌ళ్ల పాటి వేదాంత ధోర‌ణిలో మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని మిక్స్ చేసి రూపొందించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా? .. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న కార్తీకేయ‌కు హిట్‌ని అందించిందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
బ‌స్తీబాల‌రాజు చ‌నిపోయిన వారిని స్మ‌శానానికి తీసుకెళ్లే స్వ‌ర్గ‌పురి వాహ‌నానికి డ్రైవ‌ర్‌గా స్ల‌మ్ ఏరియాలో వుండే యువ‌కుడు. త‌న వృత్తిలో భాగంగా ఒక రోజు పీట‌ర్ మృత‌దేహం కోసం వెళ‌తాడు. అక్క‌డే పీట‌ర్ వైఫ్ మ‌ల్లిక‌(లావ‌ణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అక్క‌డి నుంచి మ‌ల్లిక ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ త‌న‌ని ప్రేమిస్తున్నానంటూ మ‌ల్లిక వెంట‌ప‌డుతుంటాడు బాల‌రాజు. దీంతో అత‌ని టార్చ‌ర్ భ‌రించ‌లేక మ‌ల్లిక పోలీసుల‌ని పంప్ర‌దిస్తుంది. ఆ స‌మ‌యంలోనే గంగ‌మ్మ (ఆమ‌ని) ట్విస్ట్ ఇస్తుంది. త‌ల్లి ఎంట్రీతో బాల‌రాజులో మొద‌లైన మార్పు ఏంటీ? .. బారాజుని మ‌ళ్లీక ప్రేమించిందా? .. విడో అయిన మ‌ల్లికని పెళ్లి చేసుకోడానికి బాల‌రాజు ఎలాంటి ప‌రీస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన ఇతివృత్తం.

న‌టీన‌టుల న‌టన‌:
బ‌స్తీ బాల‌రాజుగా కార్తీకేయ న‌ట‌న సూప‌ర్‌. సినిమా చూస్తున్న ప్ర‌తీ ప్రేక్ష‌కుడు ఈ పాత్ర‌తో క‌నెక్ట్ అవుతాడు. అంత‌గా కార్తీకేయ ఆ పాత్ర‌లో లీన‌మై న‌టించాడు. డైలాగ్‌ డెలివ‌రీ,  మాసీవ్ క్యారెక్ట‌రైజేష‌న్‌, కాస్ట్యూమ్స్‌, ఎక్స్ ప్రెష‌న్స్‌తో నెక్స్ట్ లెవెల్ న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే కార్ఈకేయ క‌నిపించ‌కుండా తెర‌పై బ‌స్తీబాల‌రాజు పాత్ర మాత్ర‌మే క‌నిపించేలా అద్భుతంగా న‌టించాడు. ఇక విడో న‌ర్స్ గా మ‌ల్లికగా ఛాలెంజింగ్ పాత్ర‌లో డీ గ్లామ‌ర్‌గా న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది లావ‌ణ్య త్రిపాఠి. సెకండ్ హాఫ్‌లో కార్తికేయ‌తో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్‌లో లావ‌ణ్య న‌ట‌న అదుర్స్‌.

వీరిద్ద‌రి త‌రువాత ముఖ్యంగా చెప్పుకోద‌గ్గ పాత్ర ఆమ‌నిది. ఇందులో ఆమె గంగ‌మ్మ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ముర‌ళీశ‌ర్మ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్, ర‌జిత‌, మ‌హేష్‌, భ‌ద్రం, ప్ర‌భు త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించారు. అన‌సూయ స్పెష‌ల్ గీతంలో న‌టించి అల‌రించింది.

సాంకేతిక నిపుణులు:
కర్మ్ చావ్లా ఫొటోగ్ర‌ఫీ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఎస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా బ‌స్తీ వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌డంలో క‌ర్మ్ చావ్లా మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాడు. ఇక జుక్స్ బిజాయ్ అందించిన నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. స‌త్య ఎడిటింగ్ ఇంకొంత మెరుగ్గా వుంటే బాగుండేది. జీఎం శేఖ‌ర్ ఆర్ట్ వ‌ర్క్ అత్యంత స‌హ‌జ‌త్వంగా వుంది. జీఏ2 పిక్చ‌ర్స్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:
కార్తీకేయ గుమ్మ‌కొండ తొలి సారి స్వ‌ర్గ‌పురి వాహ‌నానికి డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో న‌టించ‌డం, ఫిలాస‌ఫీని చోడించి స‌రికొత్త నేప‌థ్యంలో తెర‌కెక్కించిన చిత్రం కావ‌డం, బ‌న్నీ వాసు నిర్మించిన చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఆ అంచ‌నాల‌కుఏ త‌గ్గ‌ట్టే తొలి భాగాన్ని సాఫీగా సాగించిన ద‌ర్శ‌కుడు సెకండ్ హాఫ్‌కి వ‌చ్చేస‌రికి క‌థ‌నంలో స్పీడు త‌గ్గించ‌డం కొంత మైన‌స్‌గా మారింది. దీని వ‌ల్ల సినిమా అనుకున్న స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All