Homeటాప్ స్టోరీస్ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు కేంద్రం శుభ‌వార్త‌!

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు కేంద్రం శుభ‌వార్త‌!

Ceneter green signal to 100 occupancy
Ceneter green signal to 100 occupancy

గ‌త ప‌ది నెల‌లుగా థియేట‌ర్స్ చాలా వ‌ర‌కు మూసివేయ‌బ‌డ్డాయి. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్లో భాగంగా సినిమా హాల్స్‌కి కేంద్రం అనుమ‌తులు ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే. న‌వంబ‌ర్ నుంచి షూటింగ్‌ల‌కు అనుమ‌తులు ల‌భించ‌డంతో ఆ త‌రువాత థియేట‌ర్ల‌కు శ‌ర‌తుల‌తో కూడిన అనుమ‌త‌లు ల‌భించాయి. 50 శాతం ఆక్క్యుపెన్సీతో మాత్రమే థియేట‌ర్ల‌‌ని రీఓపెన్ చేసుకోవ‌చ్చు అంటూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెర‌వ‌డం ఏవిధంగానూ ఆమోద యోగ్యం కాద‌ని, అలా రీఓపెన్ చేయ‌డం వ‌ల్ల న‌ష్టాలు ఎదుర‌య్యే ప్రమాదం వుంద‌ని భావించిన సింగిల్ థియేట‌ర్స్ చాలా వ‌ర‌కు రీఓపెన్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. 100 శాంతం ఆక్యుప‌సెన్సీ త‌రువాతే థియేట‌ర్ల‌ని ఓపెన్ చేస్తామ‌ని చాలా వ‌ర‌కు థియేట‌ర్లు మూసి వేసి వుంచారు. తాజాగా కేంద్రం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ని ర‌న్ చేసుకోవ‌చ్చ‌ని ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు హ‌ర్షాతిరేకాల్ని వ్య‌క్తం చేస్తున్నాయి.

- Advertisement -

కేంద్రం తాజా నిర్ణ‌యంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో వున్న 1600 థియేట‌ర్లు మొత్తం రిఓపెన్ కాబోతున్నాయి. ఇటీవ‌ల కొన్ని పునః ప్రారంభం అయినా చాలా వ‌ర‌కు 100 శాంత ఆక్యుపెన్సీకి అనుమ‌తులు ల‌భించిన త‌రువాతే రీఓపెన్ చేయాల‌ని ఎదురుచూశాయి. తాజా నిర్ణ‌యంతో థియేట‌ర్ల‌న్నీ ఫిబ్ర‌వ‌రి 1 నుంచి తెరుచుకోబోతున్నాయి. కేంద్రం తాజా నిర్ణ‌యంలో దేశ వ్యాప్తంగా వున్న దాదాపు 8000 థియేట‌ర్లు రీఓపెన్ కానుండ‌టం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All