Homeగాసిప్స్ఓటిటిలకు హిట్ అవసరమా?

ఓటిటిలకు హిట్ అవసరమా?

ఓటిటిలకు హిట్ అవసరమా?
ఓటిటిలకు హిట్ అవసరమా?

ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో సినిమాను విడుదల చేసుకోవడానికి థియేటర్లలో కుదరని పని. దాంతో థియేటర్లకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ మారాయి. థియేటర్లు ఓపెన్ అయ్యేదాకా ఆగలేని వాళ్లకు ఓటిటి రిలీజ్ అనేది మంచి మార్గం. అలాగే థియేటర్లు ఓపెన్ అయ్యాక ఆ కాంపిటీషన్ ను తట్టుకుని మంచి థియేటర్లను తెచ్చుకోలేం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఓటిటి వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరసపెట్టి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్ అన్న బేధం లేకుండా సినిమాలు ఓటిటిలో విడుదలవుతున్నాయి.

అయితే ఇక్కడ ఆందోళన కలిగించే అంశమేమిటంటే ఇప్పటివరకూ ఓటిటిలో విడుదలైన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనిపించుకున్న పాపాన పోలేదు. బాలీవుడ్ లో విడుదలైన ఆరేడు సినిమాలు, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ వుడ్ తీసుకున్నా సినిమాలు అన్నీ ప్లాప్ ముద్ర వేయించుకున్నవే. రీసెంట్ గా విడుదలైన పెంగ్విన్ కూడా నెగటివ్ రివ్యూలనే మూటగట్టుకుంది.

- Advertisement -

ఇలా వరసగా ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలు అన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకుంటే ప్రేక్షకులకు ఓటిటి అంటే ఆసక్తి తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఓటిటికి హిట్ అనేది ఎంతో అవసరం. అది ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా తర్వాత విడుదలయ్యే సినిమాలు హిట్ అనిపించుకోకపోతే వాటి మనుగడ కూడా కష్టమే. అప్పుడు చిన్న నిర్మాతలకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. వరసపెట్టి సినిమాలు ప్లాప్ అవుతుంటే ఓటిటి వాళ్ళు మాత్రం కొనడానికి ఎందుకు ముందుకు వస్తారు? అందుకే అనేది ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు కూడా హిట్ చాలా అవసరం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All