Homeటాప్ స్టోరీస్ఓటిటి ప్లాట్ ఫామ్స్ తమ పద్దతి మార్చుకోనున్నాయా?

ఓటిటి ప్లాట్ ఫామ్స్ తమ పద్దతి మార్చుకోనున్నాయా?

ఓటిటి ప్లాట్ ఫామ్స్ తమ పద్దతి మార్చుకోనున్నాయా?
ఓటిటి ప్లాట్ ఫామ్స్ తమ పద్దతి మార్చుకోనున్నాయా?

ప్రస్తుతం థియేటర్లు మూసివేయడంతో ప్రజలందరికీ ప్రాధమిక ఎంటర్టైన్మెంట్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ అయ్యాయి. ఇవేంటో తెలియని వారు కూడా ఇప్పుడు వివిధ ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు సబ్స్క్రైబ్ చేసుకుని సినిమాలను, షోస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీని ద్వారా ఈ ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు సబ్స్క్రైబర్లు బాగా పెరిగారు. ఇదే పరిస్థితి మరికొంత కాలం ఉండనుండడంతో ఈ ఓటిటి సంస్థలు మరిన్ని సినిమాలను కొనుగోలు చేసి సబ్స్క్రైబర్లను మరింత ఆకర్షించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే చిన్న సినిమాల వరకూ వారు పెట్టే రేట్లకు ఈ డీల్స్ ఓకే అనుకున్నా, పెద్ద సినిమాలకు పదుల కోట్లలో డీల్స్ జరుగుతాయి. అప్పుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి ఉండడంతో ఆ మేరకు లాభాలు రావడం ఓటిటి సంస్థలకు కష్టమే. అందుకే అవి పద్దతి మార్చే క్రమంలో ఉన్నట్లు సమాచారం.

ఇన్నాళ్లూ ఓటిటి సంస్థలు ఒక్కసారి కొంత రుసుము కట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే తమ దగ్గర ఉన్న కంటెంట్ అంతా ఆ పరిమిత కాలానికి చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాల వరకూ పే పర్ వ్యూ అంశాన్ని పరిశీలించాలని ఓటిటి సంస్థలు భావిస్తున్నాయి. అంటే సబ్స్క్రైబర్లు అయినా కూడా ఆ సినిమాలు చూడాలంటె మళ్ళీ దాన్ని కొనుగోలు చేయడమో, రెంట్ కు తీసుకుని చూడటమే చేయాలన్నమాట. ముందుగా ప్రైమ్ ఈ విధానాన్ని అమలు చేయనుందని టాక్.

- Advertisement -

అటు తిరిగి, ఇటు తిరిగి ఇది సామాన్యుని నడ్డి విరిచే కార్యక్రమంలానే ఉంది. చూడాలి మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All