Homeగాసిప్స్డైరెక్టర్ పై కేసు నమోదు

డైరెక్టర్ పై కేసు నమోదు

యువ దర్శకులు అజయ్ కౌండిన్య పై కేసు నమోదు అయ్యింది . ఇటీవలే తన సినిమా బూత్ బంగళా  చిత్ర ప్రమోషన్ వేడుకలో ఈ దర్శకుడు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు . రోజా ఒప్పుకుంటే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా నేను చేస్తానని చెప్పి సంచలనం సృష్టించగా అదే రీతిలో పవన్ కళ్యాణ్ ని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు శ్రీనివాస్ యాదవ్ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసాడు . మహిళలను కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఓ లైవ్ షోలో పాల్గొంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు కాబట్టి అతడ్ని క్షమించడానికి వీల్లేదు అంటూ మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబిలీ హిల్స్ పోలీసులు అజయ్ కౌండిన్య పై కేసు నమోదు చేసారు .

బూత్ బంగళా చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నటుడిగా కూడా నటించాడు అజయ్ కౌండిన్య . అయితే ఫ్రస్టేషన్ లో మంత్రి ని , వర్మ ని , పవన్ కళ్యాణ్ ని రోజా ని ఘోరంగా అవమానించాడు . ఇప్పుడు అది కేసై కూర్చుంది . పబ్లిసిటీ కోసం చేసాడో లేక ఆవేశంలో అన్నాడో కానీ ఇప్పుడు మాత్రం అతడికి సరికొత్త తలనొప్పులు రావడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All