Homeటాప్ స్టోరీస్కేరాఫ్ కంచరపాలెం రివ్యూ

కేరాఫ్ కంచరపాలెం రివ్యూ

కేరాఫ్ కంచరపాలెం రివ్యూ
కేరాఫ్ కంచరపాలెం రివ్యూ

కేరాఫ్ కంచరపాలెం రివ్యూ :
నటీనటులు : సుబ్బారావు , రాధా బెస్సి , కేశవ , నిత్యా
సంగీతం : స్వీకర్ అగస్తి
నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి
దర్శకత్వం : వెంకటేష్ మహా
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 7 సెప్టెంబర్ 2018

అంతా కొత్త వాళ్లతో వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” కేరాఫ్ కంచరపాలెం ”. విజయ ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని చూసిన దగ్గుబాటి రానా తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నాడు . సినిమా బాగా రావడంతో షో ముందుగానే వేశారు .ప్రశంసలు పొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

నాలుగు జంటల ప్రేమ కథ కేరాఫ్ కంచరపాలెం , తన క్లాస్ మేట్ అయిన సునీత (నిత్యశ్రీ ) అంటే సుందరం (కేశవకర్రి ) కి చాలా ఇష్టం , జిమ్ లో పనిచేసే టీనేజ్ కుర్రాడైన జోసెఫ్ (కార్తీక్ రత్నం ) భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్ ) అనే బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తాడు . వైన్ షాప్ లో పనిచేసే గడ్డం ( మోహన్ భగత్ ) వేశ్య అయిన సలీమా (విజయ ప్రవీణ ) కళ్ళు చూసి ప్రేమలో పడతాడు . 49 సంవత్సరాల రాజు ( సుబ్బారావు ) గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్ అయితే 49 ఏళ్ళు వచ్చినప్పటికీ పెళ్లి కాకపోవడంతో ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు అలాంటి రాజు తన ఆఫీసర్ అయిన రాధ (రాధా బెస్సి ) ని ప్రేమిస్తాడు . ఇలా నాలుగు ప్రేమల కథ కంచరపాలెంలో
ఎలాంటి మలుపులకు కారణం అయ్యింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కథ
కథనం
డైరెక్షన్
సంగీతం
ఛాయాగ్రహణం
నటీనటులు

డ్రా బ్యాక్స్ :

మొదటి పావుగంట
పేరున్న నటీనటులు లేకపోవడం

పెర్ఫార్మెన్స్ :

అందరూ కొత్తవాళ్ళు అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు , నటించారు అనేకంటే ఆయా పాత్రల్లో జీవించారు అంటేనే కరెక్ట్ . అయితే అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపిస్తాయి నటన పరంగా కానీ కథలో లీనమయ్యే వాళ్ళకు ఆ లోపం కూడా కనిపించదు . సినిమాలో మొత్తంగా అందరూ కొత్తవాళ్ళు కావడం , అందరు కూడా తమతమ పాత్రలకు తగ్గట్లుగా నటించడం సంతోషించతగ్గ పరిణామం .

సాంకేతిక వర్గం :

ముందుగా దర్శకులు వెంకటేష్ మహా ని అభినందించాలి ఇంతటి ధైర్యాన్ని చేసినందుకు . సినిమా చూస్తున్నంత సేపు ఓ గ్రామంలోని వాస్తవిక దృశ్యాలను చూస్తున్నట్లుగా ఉంటుంది తప్ప వాస్తవానికి భిన్నంగా కమర్షియల్ జీవితాలను చూసినట్లుగా లేకపోవడం అభినందించతగ్గ విషయం . నటీనటుల నుండి తనకు రావాల్సిన నటన ని రాబట్టుకున్నాడు అలాగే సాంకేతిక నిపుణుల నుండి కూడా . అయితే ఫస్టాఫ్ లో కొంత జాగ్రత్త తీసుకొని ఉంటే మరింతగా బాగుండేది . ఛాయాగ్రహణం , సంగీతం ఈ చిత్రానికి హైలెట్స్ గా నిలిచాయి . నిర్మాణ విలువలు బాగున్నాయి , ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయడంతో స్థాయి పెరిగింది .

ఓవరాల్ గా :

విభిన్న తరహా చిత్రాలను చూడాలని అనుకునే వాళ్ళకు కేరాఫ్ కంచరపాలెం బాగా నచ్చుతుంది , కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All