Homeటాప్ స్టోరీస్వెబ్ సిరీస్ బాట ప‌ట్టిన ద‌ర్శి!

వెబ్ సిరీస్ బాట ప‌ట్టిన ద‌ర్శి!

వెబ్ సిరీస్ బాట ప‌ట్టిన ద‌ర్శి!
వెబ్ సిరీస్ బాట ప‌ట్టిన ద‌ర్శి!

ప్రియ‌ద‌ర్శి కొత్త బాట ప‌ట్టాడు. క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అన‌తి కాలంలోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ద‌ర్శి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. సినిమాల్లో న‌టిస్తూనే వెబ్ బాట ప‌ట్టాడు. డిజిట‌ల్ రంగం విస్త‌రిస్తున్న ఈ నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌ల‌కు, థియేట‌ర్ల ఓపెనింగ్‌కి మ‌రో నాలుగైదు నెల‌లు ప‌ట్టే అవ‌కాశం వుండ‌టంతో తార‌లంతా కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు.

త‌మ ఎగ్జిస్టింగ్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పేరున్న న‌టుల‌కు క‌నిపిస్తున్న ఏకైక మార్గం వెబ్ సిరీస్‌. ఇప్పుడు ద‌ర్శీ కూడా అదే బాట‌ప‌ట్టాడు. `పెళ్లిచూపులు` చిత్రంలోని `నా చావు నేను చ‌స్తా నీ కెందుకు`.. ఈ డైలాగ్‌తో పాపుల‌ర్ అయిన‌ ప్రియ‌ద‌ర్శి పులికొండ‌ స్పానిష్ చిత్రం `వైజెంట్ ఫెర్ర‌ర్`‌తో న‌టుడిగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించాడు.

- Advertisement -

త‌క్కువ టైమ్‌లోనే తన డైలాగ్ డెలివ‌రీతో పాపుల‌ర్ అయిన ప్రియ‌ద‌ర్శి న‌టించిన `వి` చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా వుంది. మ‌రో చిత్రం `జాతి ర‌త్నాలు` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుండ‌గానే `లూజ‌‌ర్‌` వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ రంగంలోకి ఎంట‌ర‌వుతున్నాడు. ప్రియ‌ద‌ర్శి, శ‌శాంక్, `రాజ‌న్న` అన్నీ, క‌ల్పిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ వెబ్ స్పోర్ట్స్ డ్రామా మే 15 నుంచి డిజిట‌ల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All