Homeటాప్ స్టోరీస్కనీసం యాభై కోట్లయినా వసూల్ చేస్తుందా ?

కనీసం యాభై కోట్లయినా వసూల్ చేస్తుందా ?

Buyers unhappy with 2. 0 collectionsనవంబర్ 29న విడుదలైన 2. ఓ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది . అయితే ఆశించిన స్థాయిలో మాత్రం లేదు . ఎందుకంటే ఈ సినిమాకు 550 కోట్ల బడ్జెట్ అని ప్రకటించారు నిర్మాత అయితే ఆ స్థాయి వసూళ్లు అయితే లేవు ముఖ్యం గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 18 . 59కోట్లకు పైగా షేర్ వసూల్ అయ్యింది రెండు రోజుల్లో . అనే మరో అయిదు రోజుల్లోనే వీలైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టాలి లేదంటే ఈ సినిమాని కొన్న వాళ్ళు భారీగా నష్టపోవడం ఖాయం . రెండు తెలుగు రాష్ట్రాలలో 2. ఓ చిత్రాన్ని 76 కోట్లకు కొన్నారు . అంటే 76 కోట్ల షేర్ వసూల్ చేయాలి అన్నమాట .

ఇప్పుడు రెండు రోజుల్లో వచ్చిన మొత్తం 18. 59 కోట్లు . ఇంకా 57 కోట్ల షేర్ రావాలి కానీ పరిస్థితి చూస్తుంటే అంత మొత్తం రావడం కష్టమే అనిపిస్తోంది . ఒకవేళ వస్తే 50 కోట్లు వస్తుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఒకవేళ పరిస్థితి మారి వసూళ్లు ఇంకా పెరిగితే అప్పుడు మాత్రం పెట్టిన పెట్టుబడి రావచ్చు . అయితే అది కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంది సుమా ! ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే 2. ఓ కొన్నవాళ్లకు కనీసం పది నుండి ఇరవై కోట్లు నష్టం వచ్చే సూచనలే ఉన్నాయి .

- Advertisement -

English Title: Buyers unhappy with 2. 0 collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All