Homeటాప్ స్టోరీస్అనుపమ “బటర్‌ ఫ్లై” టీజర్ రిలీజ్

అనుపమ “బటర్‌ ఫ్లై” టీజర్ రిలీజ్

Butterfly Movie Teaser
Butterfly Movie Teaser

సంక్రాంతి బరిలో రౌడీ బాయ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ.. ప్రస్తుతం `బటర్ ఫ్లై` మూవీ తో ప్రేక్షకుల్ ముందుకు రాబోతుంది. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై గంటా సతీష్ బాబు దర్శకత్వం లో రవి ప్రకాష్ బోడపాటి ప్రసాద్ తిరువళ్లూరి ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా అనుపమ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆకట్టుకున్న చిత్ర యూనిట్..ఈరోజు గురువారం ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసారు.

సుమారు 40 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ఎలాంటి డైలాగులు వినిపించవు. టీజర్‌ మొత్తం అనుపమే కనిపిస్తోంది. ‘నీ కళ్లను నమ్మద్దు.. బ్రెయిన్‌ను కూడా నమ్మద్దు.. మరి వేటిని నమ్మాలి’ అంటూ టీజర్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా తాలూకా అనేక విశేషాలు తెలుపనున్నారు చిత్ర యూనిట్.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All