Homeగాసిప్స్అల్లు అర్జున్ ఐకాన్ ను పక్కన పెడుతున్నాడేంటి?

అల్లు అర్జున్ ఐకాన్ ను పక్కన పెడుతున్నాడేంటి?

Allu Arjun
అల్లు అర్జున్ ఐకాన్ ను పక్కన పెడుతున్నాడేంటి?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని వరసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న కమిట్మెంట్ కారణంగా అల వైకుంఠపురములో చిత్రాన్ని ముందు మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్ లోనే ఇంత స్పీడ్ గా షూట్ చేసి ఎరుగడు. అక్టోబర్ నెలాఖరుకే ఈ చిత్రంలో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తైపోయేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్, సుకుమార్ ప్రాజెక్ట్ రెండూ ఒప్పుకున్నాడు. ముందుగా ఐకాన్ సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక సుకుమార్ సినిమాను కూడా మొదలుపెట్టి రెండు సినిమాలూ వచ్చే ఏడాది విడుదలయ్యే అల్లు అర్జున్ ప్లాన్ చేసుకున్నాడట.

- Advertisement -

కారణాలు తెలీదు కానీ ఇప్పుడు ఈ ప్లాన్ లో మార్పులు వచ్చాయిట. ఐకాన్ కాకుండా ముందు సుకుమార్ సినిమాను మొదలుపెట్టి అది పూర్తయ్యాకే ఐకాన్ పట్టాలెక్కిస్తాడట. ప్రస్తుతం సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All