Homeటాప్ స్టోరీస్బ‌న్నీ `పుష్ప‌` టీమ్‌కి ఆన్‌లైన్ క‌ష్టాలు!

బ‌న్నీ `పుష్ప‌` టీమ్‌కి ఆన్‌లైన్ క‌ష్టాలు!

బ‌న్నీ `పుష్ప‌` టీమ్‌కి ఆన్‌లైన్ క‌ష్టాలు!
బ‌న్నీ `పుష్ప‌` టీమ్‌కి ఆన్‌లైన్ క‌ష్టాలు!

క‌రోనా కార‌ణంగా స్కూల్ తెర‌వ‌డం ఈ ఏడాది క‌ష్ట‌మే. ఈ నేప‌థ్యంలో విద్యాసంవ‌త్స‌రం వేస్ కాకూడ‌ద‌నే ప్ర‌భుత్వం ఆన్‌లైన్ క్లాస్‌లకు అనుమ‌తులు మంజూరు చేసింది. దీంతో త‌ల్లిదండ్రులకు ఆన్ లైన్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఇదే త‌ర‌హా ఆన్‌లైన్ క‌ష్టాల్లో వుంది `పుష్ప‌` టీమ్‌. `అల వైకుంఠ‌పుర‌ములో` వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత బ‌న్నీ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది.

ముత్యం శెట్టి మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా ప‌క్కా గ్రామీణ యువ‌తిగా క‌నిపించ‌బోతోంది. శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగే గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌క్కా మాసీవ్ లుక్స్‌తో రూపొందించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన కీల‌క షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. దీని కోసం సైలెంట్‌గా బ‌న్నీ లొకేష‌న్స్ హంట్ చేస్తున్నారు. ఇటీవ‌ల అదిలాబాద్ కుంతాల జ‌ల‌పాతం ప‌రిస‌రాల‌ని ప‌రిశీలించిన బ‌న్నీ మ‌హారాష్ట్ర‌లోని అడ‌వుల‌ని కూడా ప‌రిశీలించిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఇదిలా వుంటే ఇందులో హీరోతో పాటు మిగ‌తా ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నీ చిత్తూరు యాస మాట్లాడ‌తాయంట‌. ఇందు కోసం ప్ర‌స్తుతం వీరికి ఓ మాస్ట‌ర్ స‌హాయంతో ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నార‌ట‌. భాష‌, డిక్ష‌న్‌పై ప‌ట్టు సాధించ‌డానికి కీల‌క న‌టీన‌టుల‌తో పాటు బ‌న్నీ, ర‌ష్మిక కూడా కుస్తీ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాష్‌రాజ్‌, జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All