
ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు..తాజాగా ఆర్ఆర్ఆర్ చూసి తన స్పందనను తెలియజేసారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన ఫై ప్రశంసల జల్లు కురిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
‘ఎన్టీఆర్ గారు.. ఆర్ఆర్ఆర్‌లో మీ కారెక్టర్‌ని నీటితో ఎందుకు పోల్చారో నాకు సినిమా చూశాకే అర్థమైంది.. ఎందుకంటే మీ నటన ఒక మహా సముద్రం. చరణ్ గారు మీరు.. మీ నటన అగ్నిపర్వతంలా బద్దలైంది.. ఈ రెంటినీ కలపడం ఒక్కరి వల్లే సాధ్యం అయింది.. అవును.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కాపరి ఉన్నాడు.. ఆయనే రాజమౌళి గారు..’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తాడనే టాక్.
- Advertisement -