
కింగ్ నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే మూవీ లో కీలక పాత్ర చేస్తున్నాడు. అమితాబచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, మౌనీ రాయ్ వంటి నటీ నటులు నటించిన ఈ సినిమా కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు లో రాజమౌళి సమర్పించబోతున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను మరియు వీఎఫ్ఎక్స్ వర్క్ ను వినియోగిస్తున్నట్లుగా సమాచారం.
ఈ సినిమాలో నాగార్జున నటించడం వల్ల తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ మొదట అనుకున్నదానికి దాదాపుగా రెండు రెట్లు పెరిగినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా ఖచ్చితంగా సినిమా ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -