Homeటాప్ స్టోరీస్వాల్మీకి షూటింగ్ వద్ద లొల్లి

వాల్మీకి షూటింగ్ వద్ద లొల్లి

Valmiki
Valmiki

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న వాల్మీకి చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో కొంతమంది బోయవాళ్ళు వచ్చి లొల్లి చేయడంతో అనంతపురం లో వాల్మీకి షూటింగ్ ఆగిపోయింది . బోయవాళ్ళు ఇంతగా వరుణ్ తేజ్ షూటింగ్ ని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటో తెలుసా …….. వాల్మీకి అనే టైటిల్ పెట్టడం వల్లే ! వాల్మీకి అనే టైటిల్ పెట్టి బోయవాళ్లకు ఆరాధ్యదైవమైన వాల్మీకి ని అవమానిస్తున్నారని అందుకే ఆ టైటిల్ ని తక్షణం తొలగించాలని ఆందోళన చేపట్టారు .

గొడవ పెద్దది కాకముందే సర్దుకుంటే మంచిదని భావించిన దర్శకులు హరీష్ శంకర్ షూటింగ్ ని క్యాన్సిల్ చేసాడు . దాంతో యూనిట్ హైదరాబాద్ బయలుదేరింది . ఇంతకుముందు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో వరుణ్ తేజ్ కారు కి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే . దాంతో అప్పుడు కూడా షూటింగ్ వాయిదాపడింది పాపం . తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ చిత్రాన్ని తెలుగులో వాల్మీకి గా రీమేక్ చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All