Homeటాప్ స్టోరీస్థ‌మ‌న్ మ‌ళ్లీ కాపీ కొట్టేశాడా?

థ‌మ‌న్ మ‌ళ్లీ కాపీ కొట్టేశాడా?

 

boom bhaddal song a copy mass beat of prasnistha?
boom bhaddal song a copy mass beat of prasnistha?

థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరున్నా అతే స్థాయిలో కాపీ క్యాట్ అనే పేరు కూడా వుంది. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `రాములో రాముల‌….`.. `సామ‌జ వ‌ర గ‌మ‌నా.. పాట‌ల‌కు సంబంధించిన ట్యూన్‌ల‌ని కాపీ చేశాడంటూ విమ‌ర్శ‌లు వినిపించాయి. తాజాగా థ‌మ‌న్ మ‌రో యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ వెంగీ స్వ‌రాల‌ని కాపీ చేశాడంటూ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

‌మా‌స్ మ‌హారాజా రవితేజ హీరోగా న‌టిస్తున్నతాజా చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. నెల్లూరులో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మాస్ బీట్‌ని దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర బృందం శనివారం రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించారు.

`భూమ్ బ‌ద్ద‌ల్ .. భూమ్ బ‌ద్ద‌ల్ .. నా ముద్దుల సౌండు` అంటూ సాగే ఈ మాస్ బీట్ సాంగ్‌లో ర‌వితేజ‌తో పాటు అప్స‌ర‌రాణి కిర్రాక్ స్టెప్పులేసింది. మాస్ బీట్స్‌… క్యాచీ లిరిక్స్‌తో సాగే ఈ పాట‌ని సింహా, మంగ్లీ ఆల‌పించారు. ర‌వితేజ మాస్ స్టెప్పులు.. అప్స‌రా రాణి అందాలు ఈ పాట‌కు ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. అయితే ఈ మాస్ బీట్ సాంగ్ యువ సంగీత ద‌ర్శ‌కుడు వెంగీ సంగీతం అందించిన `ప్ర‌శ్నిస్తా` చిత్రంలోని `ఏం ప‌ర్లేదేంప‌ర్లేదు..` అంటూ సాగే పాటకు సంబంధించిన బీట్‌ని యాజిటీగా లేపేశార‌ని చెబుతున్నారు. పాట వింటే అదే నిజ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి దీనిపై థ‌మ‌న్ ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All