Homeటాప్ స్టోరీస్ఆగిపోయిన హీరో కొడుకు పెళ్లి

ఆగిపోయిన హీరో కొడుకు పెళ్లి

 bollywood senior hero mithun chakrabortys son mahaakshays marriage cancelledబాలీవుడ్ లో ఒకప్పుడు తన స్టార్ డం తో ఓ ఊపు ఊపేసిన హీరో మిథున్ చక్రవర్తి , కాగా ఆ హీరో కొడుకు పెళ్లి ఆగిపోయింది నిన్న . ఊటీ అంటే మిథున్ చక్రవర్తి కి చాలా చాలా ఇష్టం దాంతో అక్కడ ఓ సొంత బంగాళా ఏర్పాటు చేసుకున్నాడు 80 వ దశకంలోనే . ఆ ఇంట్లోనే తన కొడుకు” మహాక్షయ్ ” పెళ్ళికి ఏర్పాట్లు చేసాడు మిథున్ చక్రవర్తి . అయితే ఇక పెళ్లి అవ్వడమే తరువాయి , సరిగ్గా ముహూర్తానికి ముందు సినిమాల్లో మాదిరిగా పెళ్లి ఆపేసినట్లు గా ఓ యువతి ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు మిథున్ చక్రవర్తి కొడుకు పెళ్లిని ఆపేసారు .

ఇంతకీ మిథున్ కొడుకు మహాక్షయ్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా …… తనని ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి నాలుగేళ్ళ పాటు సహజీవనం చేసి తనని మానసికంగా , శారీరకంగా పెళ్లి పేరుతో వాడుకున్నాడని …….. ఒకదశలో గర్భం కూడా వస్తే గర్భస్రావం చేయించాడని ఇక ఇప్పుడేమో తనపై మోజు తీరడంతో నన్ను మోసం చేస్తూ మరో పెళ్లి కి సిద్ధమయ్యాడని ఢిల్లీ పోలీసులను ఆ యువతి ఆశ్రయించడంతో పెళ్లి ఆపేసారు పోలీసులు . యువతి కోర్టు ని ఆశ్రయించడం ,కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మిథున్ కొడుకుపెళ్లి ఆగిపోయింది .

- Advertisement -

ఆ యువతి ఇంతకుముందే మహాక్షయ్ పైన మాత్రమే కాకుండా మిథున్ చక్రవర్తి భార్య పైన కూడా ఫిర్యాదు చేసింది . నాలుగేళ్ళ పాటు యువతి తో సరసాలాడిన హీరో కొడుకు ఇప్పుడేమో మరో యువతి ని పెళ్లి పేరుతో మోసం చేయడానికి రెడీ అయ్యాడు . ఈ సంఘటనతో మిథున్ చక్రవర్తి పరువు బజారున పడింది .

English Title:  bollywood senior hero mithun chakrabortys son mahaakshays marriage cancelled

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All