Homeఎక్స్ క్లూసివ్బాలీవుడ్ నటిపై దాడి

బాలీవుడ్ నటిపై దాడి

Bollywood actress Farheen robbed బాలీవుడ్ మాజీ నటి పర్హీన్ పై దోపిడీ దొంగలు దాడి చేసి విలువైన వస్తువులను దోచుకెళ్లారు అది కూడా దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో జనాలు ఉన్న చోటే కావడంతో తీవ్ర షాక్ కి గురయ్యింది పర్హీన్ . సంచలనం సృష్టించిన ఈ సంఘటన న్యూ ఢిల్లీ లో జరిగింది . సర్వప్రియ విహార్ లో నివాసం ఉండే పర్హీన్ షాపింగ్ కోసం దక్షిణ ఢిల్లీ లోని సెలెక్ట్  సిటీ వాక్ మాల్ కు తన కారులో వెళ్తున్న సమయంలో ట్రాఫిక్  సిగ్నల్ వద్ద ఓ దొంగల ముఠా ఎదురు తగిలింది .

వాళ్లతో వాగ్వాదానికి దిగిన పర్హీన్ పై దాడికి పాల్పడ్డారు . ఆమె వద్ద ఉన్న 16 వేల నగదు తో పాటు సెల్ ఫోన్ లను అలాగే ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు . ట్రాఫిక్ సిగ్నల్ వద్దే దొంగల ముఠా ఇంత పని చేయడంతో తీవ్ర షాక్ కి లోనయ్యింది , అయితే ఓ మిలిటరీ అధికారి పర్హీన్ కు చేసిన సహాయంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది . ట్రాఫిక్ సిగ్నల్ వద్దే ఈ సంఘటన జరగడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ తో దొంగల భరతం పట్టే పనిలో పడ్డారు . ఇంతకీ ఈ బాలీవుడ్ మాజీ నటి పర్హీన్ ఎవరి భార్యో తెలుసా …… మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య .

- Advertisement -

 

 

English Tite: Bollywood actress Farheen robbed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All