Homeటాప్ స్టోరీస్జూనియర్ ఆర్టిస్ట్ నుండీ నేషనల్ అవార్డు వరకూ

జూనియర్ ఆర్టిస్ట్ నుండీ నేషనల్ అవార్డు వరకూ

జూనియర్ ఆర్టిస్ట్ నుండీ నేషనల్ అవార్డు వరకూ
జూనియర్ ఆర్టిస్ట్ నుండీ నేషనల్ అవార్డు వరకూ

జీవితంలో స్ఫూర్తి కోసం ఎక్కడికో వెళ్ళి, ఎవరినో కలిసి, ఏదో నేర్చుకోనవసరం లేదు. మన కళ్ళ ముందు తిరిగే ఎంతోమంది నిజజీవిత సంఘటనలు తెలుసుకుంటే సరిపోతుంది. అలాంటి ప్రత్యక్ష స్ఫూర్తి కలిగించే జీవితం నటుడు బాబీ సింహా ది. ఆయన అసలు పేరు జయసింహా. బాబీ తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న నటుడే అయినా, ఆయనది హైదరాబాద్ దగ్గర మౌలాలీ. ఆయన తెలుగువాడే.అవకాశాల కోసం చెన్నై వెళ్ళి, మొదట్లో చిన్న జూనియర్ ఆర్టిస్ట్ గా రూ.250 లతో జీవితం మొదలుపెట్టిన వ్యక్తి, కొద్దికాలానికే తన కష్టంతో, తపనతో జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డు గెలుచుకున్నాడు.

ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ వంటి లెజెండ్స్ సరసన నటిస్తున్నాడు. మరొక నటుడు విజయ్ సేతుపతి, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ లు బాబీ ప్రాణస్నేహితులు. సొంతంగా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, పిజ్జా, సూడు కవ్వం, నేరం సినిమాలలో మంచి పాత్రలు చేసిన బాబీ సింహ కు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తన “జిగార్తాండ” సినిమాలో చేసిన పాత్రతో బ్రేక్ వచ్చింది. యావత్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులకు కూడా బాబీ సింహా ఇంటెన్సిటీ ప్రూవ్ చేసిన సినిమా అది. ఆ తర్వాత బాబీ సింహా ఫుల్ బిజీ అయిపోయాడు. మళ్ళీ గత సంక్రాంతికి రజనీకాంత్ తో కార్తీక్ సుబ్బరాజ్ చేసిన “పేట” సినిమాలో కూడా బాబీ సింహా చేసిన పాత్ర జనాలకు తెగ నచ్చేసింది. ఇప్పుడు కమల్ హాసన్ సినిమా అయిన భారతీయుడు 2 లోకూడా ఒక మంచి రోల్ చేస్తున్నాడు బాబీ సింహా. ఇప్పుడు బాబీ మెయిన్ విలన్ గా నటించిన “డిస్కో రాజా” సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. విశేషం ఏంటంటే, ఈ సినిమాలో హీరో రవితేజ కూడా రూ.100 ల జీతంతో కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు సుమారు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ స్థాయికి చేరిన నటుడు. ఇక స్క్రీన్ మీద వీళ్ళ నటన రెండు ఆకలితో ఉన్న పులులు కొట్టుకున్నట్లు ఉన్న మనం ఆశ్చర్యపోనవసరం లేదు. టాలీవుడ్ లో ఇప్పటికే ఉన్న విలన్స్ కొరతను తీర్చి బాబీ మరో ప్రకాష్ రాజ్ మాదిరి రాణించాలని ఆశిద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All