Homeటాప్ స్టోరీస్బ్లఫ్ మాస్టర్ ట్రైలర్ టాక్

బ్లఫ్ మాస్టర్ ట్రైలర్ టాక్

Bluff Master Telugu Movie Trailerతమిళ్ లో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో బ్లఫ్ మాస్టర్ గా రీమేక్ చేసారు . గోపి గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలకృష్ణ తో పలు సూపర్ హిట్  చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ రమేష్ పిళ్ళై తో కలిసి సంయుక్తంగా నిర్మించారు . సత్యదేవ్ హీరోగా నటించగా నందితా శ్వేత ఆదిత్య మీనన్ , బ్రహ్మాజీ , పృథ్వీ , సిజ్జు , చైతన్య కృష్ణ , టెంపర్ వంశీ  , దిల్ రమేష్ తదితరులు నటించిన బ్లఫ్ మాస్టర్ చిత్ర ట్రైలర్ వేడుక ఈరోజు రామానాయుడు స్టూడియో లో జరిగింది . ఆ సందర్బంగా ట్రైలర్ ని రిలీజ్ చేసారు .

ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది , టైటిల్ కి తగ్గట్లుగానే ఈ సినిమా ఉన్నట్లు స్పష్టం అవుతోంది . మొత్తానికి డబ్బు కోసం ఎంతకైనా తెగించే పాత్రలో సత్యదేవ్ నటించాడు . పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు మరో ఎస్సెట్ అనే చెప్పాలి . ఫిలిం జర్నలిస్ట్ గా విశేషమైన అనుభవం గడించిన పులగం చిన్నరాయణ ఈ బ్లఫ్ మాస్టర్ కు సంభాషణలు సమకూర్చాడు . పులగం రాసిన డైలాగ్స్ కొన్ని ట్రైలర్ గా ఉన్నాయి కాగా అవి యువత కు బలంగా తగిలేలా ఉన్నాయి .ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది .  ఈ బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Bluf Master trailer talk

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All