Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ పాటని రీమిక్స్ చేస్తున్న విశాల్

అల్లు అర్జున్ పాటని రీమిక్స్ చేస్తున్న విశాల్

Block buster song remix for Vishal ayogya తమిళ స్టార్ హీరో విశాల్ తాజాగా టెంపర్ చిత్రాన్ని అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . 2015 లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ టెంపర్ సూపర్ హిట్ అయ్యింది కాగా ఆ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు విశాల్ . కాగా ఆ రీమేక్ చిత్రంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలోని బ్లాక్ బస్టర్ అనే పాటని రీమేక్ చేయనున్నాడు విశాల్ .

 

- Advertisement -

అల్లు అర్జున్ – అంజలి ఈ బ్లాక్ బస్టర్ అనే ఐటెం సాంగ్ లో స్టెప్స్ వేయగా తమిళ చిత్రంలో మాత్రం విశాల్ తో పాటు ఆడి పాడేది మాత్రం శ్రద్దా దాస్ . సరైనోడు చిత్ర రీమేక్ హక్కులు కూడా విశాల్ దగ్గరే ఉన్నాయి దాంతో ఆ చిత్రంలోని పాటని అయోగ్య కోసం వాడుకుంటున్నాడు . ఎన్టీఆర్ కు సూపర్ హిట్ నిచ్చిన టెంపర్ విశాల్ కు ఎలాంటి హిట్ నిస్తుందో చూడాలి .

English Title: Block buster song remix for Vishal ayogya

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All