Homeటాప్ స్టోరీస్బాలకృష్ణ పై బీజేపీ కార్యకర్తల దాడి

బాలకృష్ణ పై బీజేపీ కార్యకర్తల దాడి

bjp workers attack on balakrishna నందమూరి బాలకృష్ణ పై బిజెపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు , సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఈరోజు హైదరాబాద్ లో జరిగింది . నిన్న ప్రధాని మోడీ ని ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు బాలయ్య చేయగా అందుకు ప్రతిగా బాలయ్య పై దాడికి సిద్ధపడ్డారు భాజపా కార్యకర్తలు . హైదరాబాద్ లోని బాలయ్య ఇంటిని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న సమయంలో సరిగ్గా బాలయ్య బయటి నుండి ఇంటికి రాబోతున్నాడు .

ఈ విషయం భాజపా కార్యకర్తలకు తెలిసి బాలయ్య కారుని ముట్టడించారు . కారు లోంచి బయటకు రావాలని పెద్ద ఎత్తున అరుస్తూ ప్రధాని మోడీ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు అయితే పోలీసుల సహకారంతో బాలయ్య దాడి నుండి తృటిలో తప్పించుకున్నాడు . పోలీసులు రక్షణగా నిలవడంతో క్షేమంగా ఇంట్లోకి వెళ్ళాడు బాలయ్య . భాజపా కార్యకర్తలు బాలయ్య పై దాడికి యత్నించడంతో బాలయ్య ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All