Homeటాప్ స్టోరీస్రేపు కళ్యాణ్ రామ్ 'బింబాసార' రిలీజ్ డేట్ ప్రకటన

రేపు కళ్యాణ్ రామ్ ‘బింబాసార’ రిలీజ్ డేట్ ప్రకటన

Bimbisara Release Date announcement Tomorrow
Bimbisara Release Date announcement Tomorrow

‘ఎంతమంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’, ‘కంచె’ సినిమాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా..కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా రిలీజ్ డేట్ ను రేపు ఉగాది సందర్బంగా ఉదయం
11 : 34 నిమిషాలకు ప్రకటించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్‌తో మనకు కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. హిస్టారికల్ కంటెంట్‌కు ఫిక్షన్ అంశాన్ని జోడించి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కు భారీ బడ్జెట్ పెడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts