Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ లో కుమ్మేస్తున్న బింబిసార

ఓవర్సీస్ లో కుమ్మేస్తున్న బింబిసార

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ విడుదలైన అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురిపిస్తుంది. నందమూరి కల్యాణ్ రామ్ – మల్లిడి వశిష్ట కలయికలో తెరకెక్కిన ‘బింబిసార’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. ఈ మూవీ లో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

- Advertisement -

గత కొద్దీ రోజులుగా ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్స్ మళ్లీ బింబిసార, సీతారామం చిత్రాలతో కళాకలాడుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు సూపర్ హిట్ టాక్ రావడం తో ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులుపెడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక బింబిసార విషయానికి వస్తే..ఓవర్సీస్ లో ఈ మూవీ ని శ్లోక వారు రిలీజ్ చేసారు. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ 200K గ్రాస్ సాధించి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 10.82 కోట్లు రాబట్టింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు సాదించింది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా రూ. 12.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All