Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5 : అతను సింగర్ అన్న విషయం మర్చిపోయాడా..?

బిగ్ బాస్ 5 : అతను సింగర్ అన్న విషయం మర్చిపోయాడా..?

BiggBoss 5 Singer Sriram Chandra Missed his Chance
 

బిగ్ బాస్ 5లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా వచ్చాడు ఇండియన్ ఐడల్.. ప్రముఖ సింగర్ శ్రీరాం చంద్ర. ఈ సీజన్ లో ఆడియెన్స్ కు బాగా పరిచయం ఉన్న మిగతా హౌజ్ మెట్స్ లో శ్రీరాం చంద్ర ఒకరు. హౌజ్ లో తన ఆట ఆడుతూ సత్తా చాటుతున్న శ్రీరాం చంద్ర అతనొక సింగర్ అన్న విషయాన్ని మర్చిపోయాడన్నది ఆడియెన్స్ కామెంట్. అదేంటి అడపాదడపా పాడుతున్నాడు కదా అని అనుకోవచ్చు. ఏదో నాగార్జున వచ్చినప్పుడో.. లేదా ఎవరో అడిగినప్పుడో కాదు. అతను ప్రొఫెషనల్ సింగర్ కాబట్టి శ్రీరాం చంద్ర ప్రతి సందర్భాన్ని తన పాటతో అలరించాల్సి ఉంటుంది.

కాని శ్రీరాం చంద్ర అక్కడ సింగర్ గా కన్నా హీరోలా బిహేవ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ముఖ్యంగా హమిదతో శ్రీరాం చంద్ర కలిపే పులిహోర మాములుగా లేదు. హమిద కూడా శ్రీరాం స్ట్రాంగ్ కంటెస్టంట్ కనుక అతనికి సపోర్ట్ గా ఉంటుంది. ఇదివరకు సీజన్ లో వచ్చిన సింగర్ లతో పోల్చితే శ్రీరాం చంద్ర తానొక సింగర్ అన్న విషయాన్ని మర్చిపోయాడని టాక్ వస్తుంది.

- Advertisement -

టాస్క్ లో గాని.. హౌజ్ మెట్స్ మూడీగా ఉన్న టైం లో కాని తన గొంతుతో.. తన పాటతో వారికి మంచి ఉత్సాహాన్ని అందిస్తాడని అనుకుంటే అతను.. తన టాస్కులు.. హమిద చాలు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఈమధ్య కాలంలో ఎపిసోడ్ లో శ్రీరాం చంద్ర కనిపిస్తే పక్కన హమిదతోనే తప్ప తను సింగిల్ గా కనిపించింది చాలా అరుదు. మరి శ్రీరాం చంద్ర రానున్న రోజుల్లో మారుతాడా ఇదే ఆట కొనసాగిస్తాడా అన్నది చూడాలి. అసలే టాప్ 5లో తప్పనిసరిగా ఉంటాడని అంచనాలు ఉన్న శ్రీరాం చంద్ర ఆటలో మరింత జోష్ కనబరచాలని ఆడియెన్స్ ఆశిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All