Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ సీజన్6 ఫుల్‌ ఆన్‌ జోష్‌

బిగ్ బాస్ సీజన్6 ఫుల్‌ ఆన్‌ జోష్‌

బిగ్ బాస్ సీజన్6 ఫుల్‌ ఆన్‌ జోష్‌
బిగ్ బాస్ సీజన్6 ఫుల్‌ ఆన్‌ జోష్‌

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ సీజన్ సెప్టెంబర్ 4 నుంచి టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే ఓ రోజు కూడా పూర్తయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఏకంగా 20 మంచి కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో 21 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపారు. కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి.

ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు.ఇక వీరి రెమ్యునరేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే బిగ్ బాస్ సీజన్6లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు 50 వేలనుంచి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో జబర్దస్త్ తో ఫెమస్ ఆయిన ఫైమాకు వారానికి 50వేలు ఇవ్వనున్నారట. అలాగే ఆరోహీ రావు, ఇనయా సుల్తానా లక్ష రూపాయల పారితోషకం అందుకుంటున్నారట.

- Advertisement -

అదేవిధంగా రాజశేఖర్, అభినయశ్రీ, సుదీప..1.50 లక్షలు తీసుకోనున్నారట. ఇక గలాటా గీతూ వారానికి లక్ష 75వేలు, వాసంతి కృష్ణన్, సాల్మన్ , శ్రీ సత్య, ఆదిరెడ్డిలు వారానికి 2లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని టాక్. ఇక మెరీనా వారానికి 2.50 లక్షలు, హీరో బాల ఆదిత్య, ఆర్ జె సూర్య వారానికి 3లక్షల పారితోషికం అందుకుంటున్నారట. రోహిత్ వారానికి 3.25 లక్షలు, శ్రీహాన్ 3.50 లక్షలు, చలాకి చంటి, రేవంత్ 4 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక చలాకీ చంటి, సింగర్ రేవంత్ అందరికంటే ఎక్కువగా అంటే 4 లక్షల వరకు రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలైంది. గలాటా గీతూ గొంతు ఎక్కువగా వినిపిస్తోంది. మరి మొదటి వారంలో ఎవరు హౌస్ నుంచి వచేస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All