Homeటాప్ స్టోరీస్OTT బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూస్తారా..?

OTT బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూస్తారా..?

bigg boss ott telugu house

నార్త్ లో ఎంత సూపర్ సక్సెస్ సాధిస్తూ వస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్..సౌత్ లోను అనేక భాషల్లో ఆకట్టుకుంటుంది. తెలుగు లో ఈ మధ్యనే ఐదో సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోగా..ఇప్పుడు ఓటిటి వేదిక ఫై అలరించడానికి సిద్ధమైంది. కేవలం ఒక గంట కాకుండా.. ఈసారి 24 గంటలు వినోదాన్ని ప్రేక్షకులను చేరువచేసేందుకు బిగ్‏బాస్ ఓటీటీ అంటూ సరికొత్త ప్రయత్నం చేస్తుంది. ఈ షో ఈ నెల 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన లోగో.. ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్..ఇప్పుడు బిగ్ బాస్ ఇంటిని చూపించి ఆసక్తి పెంచారు. ఇక గత సీజన్లకు హోస్ట్‏గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఈ ఓటీటీ ‏బిగ్‏బాస్ షోకు హోస్ట్‏గా వ్యవహరించనున్నారు.

కొత్తింటిని నాగార్జున కూర్చుని.. ఇక పై ‏బిగ్‏బాస్ గంట మాత్రమే చూశారు.. ఇప్పుడు గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ చెప్పుకొచ్చాడు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో ‏బిగ్‏బాస్ ఓటీటీ ఇంటిని విభిన్నంగా..సరికొత్తగా కలర్‏ఫుల్‏గా డిసైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ షో రేపు (ఫిబ్రవరి 26న) సాయంత్రం 6 గంటలు స్ట్రీమింగ్ కానుట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలో బిగ్‏బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ప్రచారం నడుస్తోంది. అందులో యాంకర్ స్రవంతి, ఆవకాయ సినిమా హీరోయిన్ బింధుమాధవి.. యాంకర్ శివ ఉన్నట్లు సమాచారం. ఇక మాజీ కంటెస్టెంట్స్‏గా అందులో ధనరాజ్, ముమైత్ ఖాన్.. తనీష్, ఆదర్శ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, సరయూ, హమీదా, నటరాజ్ మాసర్ బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్స్ గా పాల్గోనబోతున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All