Homeటాప్ స్టోరీస్ఆటలు ఆడిపించాలి కానీ మనుషులతో కాదు

ఆటలు ఆడిపించాలి కానీ మనుషులతో కాదు

ఆటలు ఆడిపించాలి కానీ మనుషులతో కాదు
ఆటలు ఆడిపించాలి కానీ మనుషులతో కాదు

మొన్న ఆదివారం కనుక జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ లో ఎవరు బయటికి పోతారు? అని ఆత్రుతగా జనాలు టీవీ ల ముందు కూర్చొని చూస్తున్నారు “బిగ్ బాస్” షో ని. ఎవరో ఒకలు వెళ్లాల్సిందే కదా అని అనుకునే వారు కొంతమంది అయితే మాకు నచ్చిన అతను – ఆమె ఎలిమినేట్ కావద్దు అని కొంతమంది అనుకుంటారు. అలా అనుకుంటూ ఉండగా చివరికి మొగుడు పెళ్ళాలు అయిన వరుణ్ – వితిక ఇద్దరిలో ఒకలు ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పి…..నాగార్జున గారు చిన్న విరామం తీసుకొని వచ్చి వితిక ని ఎలిమినేట్ చేసేసారు.

తన భార్య ఎలిమినేషన్ నీ తట్టుకోలేక పోయిన వరుణ్ చాలా ఏడ్చేసారు. అయితే వితిక ఎలిమినేట్ కావడం నాగార్జున గారికి ముందే తెలుసో లేదో తెలీదు కానీ గత సోమవారం నుండి శుక్రవారం వరకు ఓట్లు వేసిన జనాలకి అయితే వితిక ఎలిమినేట్ కావడం ఖాయం అని ట్విట్టర్ లో, ఇస్టాగ్రాం లో జనాలకి తెలిసిపోయింది. కారణం అప్పటికి మాధ్యమాల్లో వితిక గురించి గట్టిగానే ప్రచారం ఊపందుకుంది. అసలే ఇది బిగ్ బాస్ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఆ బిగ్ బాస్ కే తెలీదు. వితిక ఎలిమినేషన్ కావడం తప్పుడు ఆరోపణ అని జనాలకి ఒక మాదిరి అనుమానం కూడా ఉంది. అందుకే కొంతమంది వితిక ఎలిమినేషన్ కావడం కుదరదు అని గట్టి నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి మాధ్యమాల్లో వచ్చిన వార్త నిజం చేస్తూ వితిక ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వెళ్లిపోయింది. వెళ్తూ వరుణ్ ని కంటతడి పెట్టవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది.

- Advertisement -

ఇక సోమవారం ఎపిసోడ్ లో 92 రోజులకీ చేరిన బిగ్ బాస్ ‘టిక్కెట్ టు ఫైనల్’ కి మిగిలిన 6 గురిలో ఒకలు గెలిచి ఫైనల్ కి వెళతారు మిగిలిన 5 గురు నామినేషన్ లోకి వెళ్తారు అని చెప్పారు ఆ టాస్క్ గురించి. అప్పటికి ప్రోమో లో ఏదో జరుగబోతోంది అని చూపించిన బిగ్ బాస్ మిగిలిన 6 గురు సభ్యులకి ఒక కొత్తరక మైన టాస్క్ ని ఇచ్చారు. ఎదురుగా ఉన్న బోర్డ్ మీద మీకు నచ్చిన కలర్ పలకని తీసుకొమ్మని 6 పలకలు పెట్టారు. అందరూ వారికి నచ్చిన కలర్స్ తీసుకున్నారు. అందులో 40%, 50%, 70% అని ఇలా ఉన్నాయి. అలా ఉన్న నంబర్స్ వారి బ్యాటరీ సామర్థ్యం నిరూపించుకోవాలి అని వాటిని తగ్గకుండా తగిన టాస్క్ చేయాలి అని ఒక మెలిక పెట్టారు. ఆ టాస్క్ పేరు “బ్యాటరీ ఉంటే నిండుగా జరుపుకోండి పండుగ” అని కూడా చెప్పారు.

గార్డెన్ ఏరియా లో రెండు గంటలు పెట్టి ఎవరైతే ఇద్దరు గంట కొట్టి టాస్క్ ఆడి గెలిస్తే వారి బ్యాటరీ 10% పెరుగుతుందని అని ఓడిపోతే 10% తగ్గుతుందని చెప్పారు. ఒకసారి గంట కొట్టిన ఇద్దరికీ ఇంకొకసారి గంట కొట్టే అవకాశం లేదని చెప్పారు. మొదటి వరుసలో అలీ రెజా కి – శివ జ్యోతి కి టాస్క్ పడింది వారిలో ఎవరైతే నిండు అరటి గెల లో ఎక్కువ అరటిపండ్లు ఎవరు తింటే వారు గెలిచినట్లు అన అన్నారు. శివ జ్యోతి 15 అరటిపండ్లు తినగా ఆలీ రెజా 21 తిన్నాడు. ఆలీ రెజా గెలిచి 10% బ్యాటరీ ఛార్జింగ్ పెంచేసుకున్నాడు. ఇక శివజ్యోతి కి ఆలీ రెజా కి ఇంకొక సారి గంట కొట్టే అవకాశం లేదు.

తర్వాత ఇద్దరిలో టాస్క్ వరుణ్ – రాహుల్ కి పడింది. అప్పటికి శ్రీముఖి బయపడుతూ ఉంది. పుసుక్కున తనకి రాహుల్ కి ఎక్కడ టాస్క్ పడుతుంది అని సేఫ్ గేమ్ ఆడుతూ ముందే ప్రణాళికా వేసుకుంది. ఒకసారి బాబా బాస్కర్ – శ్రీముఖి కి టాస్క్ పడింది బాబా బాస్కర్ గెలిచి 10% ఛార్జింగ్ పెంచుకున్నాడు. రాహుల్ – వరుణ్ లో రాహుల్ గెలిచి తన బ్యాటరీ 10% పెంచేసుకున్నాడు. ఇంతటితో సోమవారం రోజు ఎపిసోడ్ అయిపోయింది. ఓడిపోయిన వారు 10% బ్యాటరీ తగ్గించుకుని గెలిచిన వారు 10% బ్యాటరీ పెంచేసుకున్నారు. వారి అందరిలో ఆలీ రెజా ముందు వరుసలో ఉన్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్ ప్రోమో చూపిస్తూ ఆలీ రెజా కి బాబా బాస్కర్ కి పోటీగా టాస్క్ ఇచ్చారు.

అసలే రీ-ఎంట్రీ తర్వాత ఆలీ రెజా బాబా గారి మీద కూసింత ఆగ్రహం గానే ఉన్నాడు. మంగళవారం ఎపిసోడ్ లొ కూడా ఆలీ బాబా గారిని డిఫెన్స్ చేసుకుంటున్నాడు అందుకోసం బాబా గారిని తోసెయ్యడం వగైరా అన్నీ ప్రోమోలో కనిపిస్తుంది. ఒకవేళ వారి ఇద్దరిలో ఎవరికి అయినా గాయాలు తగిలితే మళ్ళీ బిగ్ బాస్ గారే టాస్క్ రద్దు అయింది అని చెప్తారు. ఇంత చేసే బిగ్ బాస్ టాస్క్ అంటే గేమ్ ఆడిపించాలి కానీ మనుషులతో కాదు బిగ్ బాస్ అని బాబా తరపు అభిమానులు అగ్రహంగా ఉన్నారు. అలాగే శ్రీముఖి కి రాహుల్ కి మద్య ఇలాంటి టాస్క్ వచ్చేలా చేయమని రాహుల్ అభిమానులు వేడుకుంటున్నారు.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All