Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 4: ఈరోజు ఎలిమినేట్ అవుతోంది ఎవరు?

బిగ్ బాస్ 4: ఈరోజు ఎలిమినేట్ అవుతోంది ఎవరు?

బిగ్ బాస్ 4: ఈరోజు ఎలిమినేట్ అవుతోంది ఎవరు?
బిగ్ బాస్ 4: ఈరోజు ఎలిమినేట్ అవుతోంది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 4 దూకుడుగా సాగుతోంది. వారాలు గడిచే కొద్దీ ఆటగాళ్లు గేమ్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద ప్లేయర్స్ కాదు అనుకున్న వాళ్ళు టాస్క్ లలో పెర్ఫర్మ్ చేస్తుండడంతో గేమ్ షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే షో మొదలై ఐదు వారాలు గడిచిపోయాయి. గేమ్ లో ఇప్పటికే సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ లు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ అనారోగ్య కారణాల కారణంగా హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇక ముగ్గురు హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన విషయం తెల్సిందే.

కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, అవినాష్ లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో అవినాష్ కొద్దిరోజుల్లోనే అందరినీ తన కామెడీతో ఆకట్టుకుని హౌస్ లో సూపర్ స్ట్రాంగ్ అనిపించుకున్నాడు. ఇక కుమార్ సాయి కెప్టెన్ అయిన కారణంగా లాస్ట్ వీక్ నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. ఈ వారం చాలా టఫ్ టాస్క్ చేసి సోహైల్ ఇంటి కెప్టెన్ అయ్యాడు.

- Advertisement -

ఇక ఈరోజు సండే అంటే ఎలిమినేషన్ కచ్చితంగా. నిన్నటి ఎపిసోడ్ లో సోహైల్, అఖిల్ సేవ్ అయ్యారు. ఇంకా నామినేషన్స్ లో అభిజీత్, సుజాత, నోయెల్, అమ్మ రాజశేఖర్, లాస్య, మోనాల్ నామినేషన్స్ లో ఉన్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ వారం జోర్దార్ సుజాత ఎలిమినేట్ అవ్వనుందని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All