Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్ 4: ఆ ఇద్ద‌రిలో బ‌య‌టికి వెళ్లేది ఎవ‌రు?

బిగ్‌బాస్ 4: ఆ ఇద్ద‌రిలో బ‌య‌టికి వెళ్లేది ఎవ‌రు?

బిగ్‌బాస్ 4: ఆ ఇద్ద‌రిలో బ‌య‌టికి వెళ్లేది ఎవ‌రు?
బిగ్‌బాస్ 4: ఆ ఇద్ద‌రిలో బ‌య‌టికి వెళ్లేది ఎవ‌రు?

బిగ్ బాస్ 4 తెలుగు ఓ వారం హుషారుగా.. ఓ వారం నీర‌సంగా సాగుతోంది.  ఎంత ర‌చ్చ చేసినా రేటింగ్‌ స్వల్పంగా తగ్గింది. దీంతో మేక‌ర్స్ కొంత మసాలాని జోడించాల్సిన సమయం ఆసన్నమైన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే స‌గం డేస్ పూర్తి చేసిన ఈ షో మ‌రింత‌గా ఆక‌ట్టుకోవాలంటే ఏదో కొత్త‌ద‌నాన్ని యాడ్ చేయాలా. లేదా హీటెక్కించాలి. ప్ర‌స్తుతం మేక‌ర్స్ అదే ప‌నిలో వున్నారు.

వ‌చ్చే నెల గ్రాండ్ ఫైనల్ స్థాయికి చేరుకోబోతోంది. కాబ‌ట్టి ఈ సారి ఎలిమినేష‌న్ రౌండ్ మ‌రింత గ‌ట్టిగా హౌస్‌ని హీటెక్కించేలా ఈ వారాంతంలో ఐదుగురు ఇంటి స‌భ్యుల్ని తొలగించాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ వారాంతంలో ఎవరు హౌస్ నుండి బ‌య‌టికి వెళ్ల‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అమ్మ‌రాజ‌శేఖ‌ర్ గ‌త వారం ఎలిమినేట్ అయినా రేయోల్ రిక్వెస్ట్ కార‌ణంగా త‌ప్పించుకున్నాడు. కానీ ఈ వారం మాత్రం మోనాల్ గజ్జర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ వారాంతంలో హౌస్ నుండి బ‌య‌టికి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

- Advertisement -

ఈ ఇద్దరూ గ‌త కొన్ని వారాలుగా రెడ్ లిస్టులో ఉన్నారు. ఈ వారాంతంలో వీరిద్దరూ ఇంటి నుండి బయటకు వెళ్ళవచ్చని సోషల్ మీడియాలో హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఈ ఇద్ద‌రిలో అత్య‌ధికంగా నెటిజ‌న్స్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌ని వ్య‌తిరేకిస్తున్నారు. అత‌న్నే ఇంటి నుంచి బ‌య‌టికి పంచించాల‌ని భావిస్తున్నారు. హౌస్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్ ప్ర‌వ‌ర్త‌న కూడా ఏమంత‌గా లేదు. చీటికి మాటికి ఇంటి స‌భ్యుల‌పై చిరాకు ప‌డుతున్నాడు. త‌న‌ని నామినేట్ చేస్తే వారిని మ‌ళ్లీ త‌ను సిల్లీ రిజ‌న్స్‌తో నామినేట్ చేయ‌డం ఇంటి స‌భ్యుల‌కే న‌చ్చ‌డం లేదు. దీంతో అమ్మ రాజశేఖర్ ఈ వారం ఎలిమినేట్ కావ‌డం ప‌క్కా అని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All