
రాధే శ్యామ్ కు ఏపీలో బిగ్ షాక్ తగిలింది. మరికొన్ని గంటల్లో రాధేశ్యామ్ మూవీ టాక్ బయటకు రాబోతుంది. దాదాపు మూడేళ్లుగా డార్లింగ్ అభిమానులు , సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల టికెట్ బుకింగ్ ఓపెన్ కావడం , మొదటి రోజు ఫుల్ అవ్వడం జరిగిపోయాయి. కానీ ఏపీ లో మాత్రం ఇప్పటికే వరకు టికెట్ బుకింగ్ ఓపెన్ కాకపోయేసరికి అభిమానులు మండిపడుతున్నారు.
మొన్నటి వరకు ఏపీలో జీవో 35 అమల్లో ఉంది. దీని కారణంగా టికెట్ ధరలు టీ ధరలతో సమానంగా ఉండేవి. కానీ తాజాగా ప్రభుత్వం కొత్త ధరలతో జీవో విడుదల చేసింది. జీవో 35ని సవరిస్తూ భారీ చిత్రాలు వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలు ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకు టికెట్ రేట్లని పెంచుకోవచ్చని ఐదవ షోని ప్రదర్శించకోవచ్చని కొత్త జీవోని విడుదల చేసింది. దీంతో ఇండస్ట్రీ అంతా సంబరాలు చేసుకున్నారు. ఈ ధరలతో రాధే శ్యామ్ మూవీ కి ఇబ్బంది ఉండదని అనుకున్నారు. కానీ ఈ మూవీ మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏపీకి చెందిన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకపోవడం అభిమానులను, సినీ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది. దీనికి కారణాలు ఏంటో తెలియడం లేదు. మరి ఎప్పుడు బుక్ మై షో లో టికెట్స్ పెడతారో అని అభిమానులంతా క్లిక్ చేస్తూ కూర్చున్నారు.