
మరో పది రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతున్న క్రమంలో ఈ చిత్రాన్ని నిలిపివేయాలని అల్లూరి సౌమ్య హైకోర్టు లో పిటిషన్ వేయడం అందర్నీ ఖంగారుకు గురిచేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కొమ్రుంభీం చరిత్రను వక్రీకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు.
అటు ఆర్ఆర్ఆర్ సినిమా తరపున కూడా కోర్టులో వాదనలు జరిగాయి. అల్లూరి, కొమ్రుంభీంలను దేశభక్తులుగా చూపామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా కల్పిత కథేనని, సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చిందని కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న కోర్ట్.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. సినిమాతో అల్లూరి, కొమ్రుంభీంల పేరు, ప్రఖ్యాతలకు భంగం కలగదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు తో చిత్ర యూనిట్ కు పెద్ద రిలీఫ్ దొరికినట్లు అయ్యింది.