Homeటాప్ స్టోరీస్పెద్ద సినిమాలు సొంత నిర్మాణంలో....మంచి పేరు కూడా...

పెద్ద సినిమాలు సొంత నిర్మాణంలో….మంచి పేరు కూడా…

పెద్ద సినిమాలు సొంత నిర్మాణంలో....మంచి పేరు కూడా...
పెద్ద సినిమాలు సొంత నిర్మాణంలో….మంచి పేరు కూడా…

తెలుగు పరిశ్రమలో ఒక్కసారి చరిత్ర చూస్కుంటే… పెద్ద పెద్ద సినిమాలకి అప్పటి పెద్ద హీరోలు కథ అందియ్యడం, నచ్చితే సొంత నిర్మాణంలో నిర్మించడం, లేదా ఫ్యామిలీ లో అందరూ కథ కి సూట్ అవుతే అందరూ నటించడం చూసాం. ఇప్పుడు ఆ సినిమాలే చరిత్ర సృష్టిస్తున్నాయి. రామరావు, నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, మురళి మోహన్, మోహన్ బాబు అందరూ ఇలానే చేసేవాళ్ళు అప్పట్లో.

అలా సొంత నిర్మాణంలో చేసిన కొన్ని పెద్ద సినిమాలు చూసుకుందాం. ”మనం” సినిమా….. అక్కినేని తరం అందరూ నటించారు ఆ సినిమాలో. సినిమాని దగ్గర ఉండి నిర్మించారు నాగార్జున గారు…. సినిమా ఫలితం కూడా బాగా వచ్చింది. నాగేశ్వర రావు చివరి సినిమాగా కుటుంబానికి మంచి గిఫ్ట్ ఇచ్చి వెళ్లారు. అలా చాలా మంది చేసారు కానీ అవి వేరే బ్యానర్ లో చేసినవి కూడా ఉన్నాయి. వేరే బ్యానర్ లో చేసినవి సినిమాలు మంచిగా ఆడలేదు.

- Advertisement -

అదే సొంత నిర్మాణంలో, సొంత ఫ్యామిలీతో చేసిన సినిమాలు మాత్రం హిట్ అవుతాయి అనడంలో నిన్న విడుదల అయ్యిన ‘సైరా నరసింహా రెడ్డి‘ సినిమా ఉదాహరణ. రామ్ చరణ్ తన తండ్రి కోరిక అని తండ్రికోసం చేస్తున్న సినిమా అని ఎక్కడ తగ్గకుండా తీసాడు సినిమాని. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తుంది. అక్కినేని వారికి ‘మనం’ సినిమాలాగే కొణిదెల చిరంజీవి ఫ్యామిలీ కి ‘సైరా’ అనడంలో సందేహం లేదు.

మోహన్ బాబు గారు చేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ కొంచెం లో తృటి తప్పింది. ఆ సినిమాలో కూడా ‘మంచు’ ఫ్యామిలీ అందరూ నటించారు. ఫలితం దక్కలేదు కానీ కొడుకులతో నటించాలి అనుకున్న మోహన్ బాబు గారి కల తీరింది అని చెప్పవచ్చు. ఆ సినిమా యావరేజ్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఎంతైనా మన అనుకున్న ఫ్యామిలీతో మనం నటిస్తే, మనం నిర్మిస్తే అప్పుడు ఆ సినిమా హిట్ అవ్వడం….అప్పుడు ఆ ఫ్యామిలీ ని గుర్తు చేస్కుంటూ హీరోలా, కుటుంబాలా అభిమానులు జరుపుకొనే పండగ మరుపురానిది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All