Homeటాప్ స్టోరీస్స్టార్ హీరోల సినిమాలకు చుక్కలు చూస్తోన్న నిర్మాతలు

స్టార్ హీరోల సినిమాలకు చుక్కలు చూస్తోన్న నిర్మాతలు

telugu cinema producers
telugu cinema producers

ఎవరెన్ని చెప్పినా, ఎవరెంత కాదన్నా సినిమా అనేది వ్యాపారమే. ఇందులో వచ్చే లాభాలే నిర్మాత ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. కేవలం అభిరుచి ఉన్న చిత్రాలనే నిర్మించుకుంటూ పోతే వాటితో లాభాలు రాకుండా ఇక సినిమాలు తీసేది ఎందుకు? సినిమా నిర్మాణంలో మొదటినుండి నిర్మాతే బలిపశువు అవుతూ వస్తున్నాడు. నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుంది అని అందరికీ తెలుసు. కానీ నిర్మాత బాగోగులు గురించి ఆలోచించేది ఎంత మంది? ఎంత సేపూ మన జేబులో డబ్బులు పడ్డాయా లేదా అన్నదే చూస్తారు. కనీసం ఇదివరకు పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది.

సినిమా రిజల్ట్ తో పనిలేకుండా లాభాలు సంగతి అటుంచి నిర్మాత కనీసం సేఫ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు నిర్మాతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అదేదో సినిమాలో సాయాజీ షిండే చెప్పినట్లు సినిమాలు తీయడమే పాపమైపోయింది అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. సినిమా హిట్ అవుతున్నా నిర్మాతల జేబులు నిండట్లేదు. వచ్చిన కొన్ని లాభాలు కూడా ముందు మొండి బకాయిలు చెల్లించడానికి, నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సర్దుబాటు చేయడానికి సరిపోతాయి. లాభాలు కళ్లజూడకుండా ఇక సినిమాలు తీయడమెందుకు అన్న ఫీలింగ్ నిర్మాతలకు కలగడంతో తప్పేముంది?

- Advertisement -

నిర్మాత కన్నా ఈ బిజినెస్ లో ఎక్కువ నష్టపోయేది బయ్యర్లే. సినిమా కథ గురించి తెలియకుండా, ఎప్పుడు విడుదలవుతుంది అన్నది క్లారిటీ లేకుండా కేవలం కాంబినేషన్ క్రేజ్ చూసి టాప్ హీరోల సినిమాలను కొనుక్కుంటారు. సినిమా బాగుంటే ఓకే ఏదైనా తేడా వచ్చిందంటే ఇక బయ్యరు చేతులు కాల్చుకున్నట్లే. ఆపై నిర్మాతలు, హీరోలు దయ తలిస్తే నష్టాలు కొంత పూడుకుంటాయి. లేదంటే వారి ఇల్లు గుల్లవుతుంది. చాలా తక్కువ శాతం సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ సినిమాలది. అయినా ఆశతో ఇంకా సినిమాలను తీసే వారు, కొనేవారు ఉన్నారు.

ఇదివరకు పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. నటుల పారితోషికానికే 60 శాతం బడ్జెట్ వెళ్ళిపోతోంది. ఇందులో హీరో, హీరోయిన్, దర్శకుడికే 40 శాతం ఖర్చుపెట్టాలి. లేదంటే ఈ మధ్య హీరోలు బాగా నేర్చింది జరిగిన బిజినెస్ లో వాటా తీసుకోవడం. దీంతో పాటు హీరోలు ఈ మధ్య రెండు ప్రొడక్షన్ హౌస్ లను కలిపి సినిమాలు తీసేలా ప్లాన్ చేస్తున్నారు. లేదంటే నిర్మాణంలో తమ బ్యానర్ కూడా ఉండాలని పట్టుబడుతున్నారు. వీటి వల్ల డెసిషన్ మేకింగ్ అనేది కష్టమైపోతుంది. నిర్ణయం ఒకరి దగ్గర ఉండదు. నిర్మాణంలో తలో చేయి వేసినా కూడా బడ్జెట్ లు అయితే తగ్గట్లేదు. దానివల్ల నిర్మాతలు అయితే సేఫ్ అవుతారేమో కానీ ఎప్పటికీ బుక్కయ్యేది బయ్యర్లే. మరి ఈ పరిస్థితి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బయటపడుతుందో ఏంటో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All