Homeటాప్ స్టోరీస్సక్సెస్ కోసం పోరాడుతున్న బిచ్చగాడు హీరో

సక్సెస్ కోసం పోరాడుతున్న బిచ్చగాడు హీరో

తమిళ హీరో కం సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోనీ కి బిచ్చగాడు తెలుగు , తమిళంలో పెద్ద హిట్ అయ్యింది అందునా తెలుగులో మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రానికి పోటీగా రిలీజ్ అయి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది దాంతో విజయ్ ఆంటోనీ చిత్రాలకు తెలుగులో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . అయితే బిచ్చగాడు ఊపులో వచ్చిన చిత్రాలేవీ ఆ హవాని కొనసాగించలేకపోయాయి .

- Advertisement -

బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ప్రతీ చిత్రం తెలుగులో కూడా విడుదల అయ్యింది అయితే అన్ని సినిమాలు కూడా ప్లాప్ లు డిజాస్టర్ లు అయ్యాయి . దాంతో ఈ హీరో మార్కెట్ ఢమాల్ అయ్యింది . కట్ చేస్తే తాజాగా కిల్లర్ అనే సినిమాతో ఈనెల 7 న మళ్ళీ వస్తున్నాడు . ఇందులో సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్ర పోషించాడు . ఈ సినిమాపై విజయ్ ఆంటోనీ చాలా ఆశలే పెట్టుకున్నాడు . సక్సెస్ కోసం మూడేళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు . మరి కిల్లర్ అయినా ఆ లోటు పూడ్చుతుందా ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All