విజయ్ ఆంటోనీ నుండి 2016 లో వచ్చిన చిత్రం బిచ్చగాడు. ఈ మూవీ తెలుగు లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు..చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది. వీకెండ్ లో అయితే టికెట్స్ కూడా దొరకని పరిస్థితి నెలకొల్పింది. అలాంటి ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.
ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు ఇలా అన్ని ఒక్కడే చుకుంటూ ఈ చిత్రాన్ని రూపుదిద్దిస్తున్నాడు. ఈ మూవీ లో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈరోజు గురువారం చిత్ర థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు ’ అనే మాటలు థీమ్ సాంగ్‌లో వినిపిస్తాయి. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.