Homeటాప్ స్టోరీస్బంగార్రాజుకు జోడీగా భూమికని ఫిక్స్ చేశారా?

బంగార్రాజుకు జోడీగా భూమికని ఫిక్స్ చేశారా?

Bhumika to play key role in Nagarjuna Bangarraju
Bhumika to play key role in Nagarjuna Bangarraju

కింగ్ నాగార్జున న‌టించిన ఇన్వెస్టిగేటివ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వైల్డ్ డాగ్‌`. ఈ మూవీ ఏప్రిల్ 2న వ‌రల్డ్ వైడ్‌గా  రిలీజ్‌‌కి రెడీ అవుతున్న నేప‌థ్యంలో త‌న నెక్స్ట్ మూవీని ప‌ట్టాలెక్కించేందుకు నాగ్ సిద్ధ‌మ‌వుతున్నారు.  గ‌తంలో వ‌చ్చిన  `సోగ్గాడే చిన్ని నయానా` నాగ్ కెరీర్‌లో తిరుగులేని హిట్‌గా నిలిచి 50 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా `బంగార్రాజు` చిత్రాన్ని ప్రకటించారు.

ఈ మూవీ ప్ర‌క‌టించి ఇప్పటికి చాలా కాలం అయ్యింది. ఈ కొత్త ప్రాజెక్ట్ అనేక కారణాల వల్ల ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ యోచిస్తున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల స్వ‌యంగా నాగార్జున ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలై నుంచి ప్రారంభించ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు కూడా.

- Advertisement -

ఈ చిత్రంలో నటి భూమికా చావ్లా కీలక పాత్ర పోషించే ఆలోచనలో ఉందని తాజాగా వినిపిస్తోంది.  ప్ర‌స్తుతం నటితో చర్చలు జరుగుతున్నాయ‌ని ఆమె ఈ ప్రాజెక్ట్‌కు ఫైన‌ల్‌గా సంతకం చేసిన తర్వాత అధికారిక ప్రకటన రానుంద‌ని తెలిసింది. భూమిక, నాగార్జున ఇంతకుముందు `స్నేహమంటే ఇదేరా` చిత్రంలో కలిసి నటించారు. రెండు దశాబ్దాల తరువాత ఈ చిత్రంలో మ‌ళ్లీ నాగ్‌, భూమిక క‌లిసి న‌టించ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కళ్యాణ కృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. నాగ్ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All